Molhana

అమ్మా అలవేలుమంగమ్మా
మోహన వేంకట రమణుని
ముద్దుల రాణి మోర వినవమ్మా
మృధు మధుర మధు మంజుల వాణి
పద్మమ్మ పలుకవమ్మా
అలకల కులుకుల ఆమని
తలుపుల అలవేలుమంగమ్మా
హరి చిలకల పలుకుల
తొలకల మొలకల
సురుచిర సుమధుర సుధవమ్మా
మోహన వేంకట రమణుని
ముద్దుల రాణి మోర వినవమ్మా

అనంత రంగని ఆంతరంగమున
అమృత తరంగము నీవమ్మా
అంగరంగ వైభోగ కమనీయ
కళ్యాణ గంగవమ్మా
పట్టిన పట్టును వీడక
శ్రీనివాసుని చేపట్టితివమ్మా
ఏవేళనైనా ఏఘడియనైనా
పతి ఎద వీడి ఎరుగవమ్మా
ప్రేమకు పెన్నిధి అమ్మా
పేదకు సన్నిధి అమ్మా
మోహన వేంకట రమణుని
ముద్దుల రాణి మోర వినవమ్మా

కొండంత ఆశతో తిరుమల
కొండ నుండ కోరితినమ్మా
కొండంత ఆశతో తిరుమల
కొండ నుండ కోరితినమ్మా
అది ఏమోగాని నీ విభుడు
నిన్నడిగి నన్నిచట ఉండమనెనమ్మా
అమ్మా వ్యూహలక్ష్మి అనుమతినివ్వవమ్మా

అనుమతినివ్వవమ్మా
అనుమతినివ్వవమ్మా



Credits
Writer(s): Vedavyasa, M M Keervani
Lyrics powered by www.musixmatch.com

Link