Dheera Dheera

ధీర ధీర ధీర మనసాగలేదురా
చేర రార శూర సొగసందుకో దొర
అసమాన సాహసాలు చూడరాదు నిద్దుర
నియమాలు వీడి రాణివాసమేలుకోర ఏకవీర ధీర
ధీర ధీర ధీర మనసాగలేదురా
చేర రార శూర సొగసందుకో దొర
సఖి స... సఖి

సమరములో దూకగా చాకచక్యం నీదేరా
సరసములో కొద్దిగా చూపరా
అనుమతితో చేస్తున్నా అంగరక్షణ నాదేగా
అధిపతినై అదికాస్తా దోచేదా
పోరుకైన ప్రేమకైనను దారి ఒకటేరా
చెలి సేవకైన దాడికైన చేవ ఉందిగా
ఇక ప్రాయమైన ప్రాణమైన అందుకోర ఇంద్ర పుత్ర
ధీర ధీర ధీర మనసాగలేదురా
చేర రార శూర సొగసందుకో దొర

శశి ముఖితో సింహమే జంట కడితే మనమేగా
కుసుమముతో ఖడ్గమే ఆడదా
మగసిరితో అందమే అంతు తడితే అంతేగా
అణువణువు స్వర్గమే అయిపోదా
శాసనాలు ఆపజాలని తాపముందిగా
చెరసాలలోని ఖైదు కాని కాంక్షవుందిగ
శతజన్మలైనా ఆగిపోని అంతులేని యాత్ర చేసి
నింగిలోని తార నను చేరుకుందిరా
గుండెలో నగార ఇక మోగుతోందిరా
నవ సోయగాలు చూడ చూడ రాదు నిద్దుర
ప్రియ పూజలేవో చేసుకోన చేతులారా సేదతీర
ధీర ధీర ధీర
ధీర ధీర ధీర



Credits
Writer(s): Chandrabose, M.m. Keeravani
Lyrics powered by www.musixmatch.com

Link