Gundello Lo Na Puntiddi

గుండెల్లోనే పుట్టిందమ్మా గోదావరీ
కన్నుల్లోనే పొంగిందమ్మా గంగాఝరీ
నా ఒడి చేరీ ఓ లాహిరీ నాలో పాడే నీళాంబరీ
గుండెల్లోనే పుట్టిందమ్మా గోదావరీ
కన్నుల్లోనే పొంగిందమ్మా గంగాఝరీ
నా ఒడి చేరీ ఓ లాహిరీ నాలో పాడే నీలాంబరీ

ఎదను దాటి ఎదుట నిలిచే ఓ రూపం
మ్మ్ ఆ ఓ
నిదురలేచే నిన్న లేని ఓ బంధం
మ్మ్ ఆ ఆఆ
చిగురు తొడిగె సిగ్గుపెదవి పేరంటం చెలరేగె కలలెన్నో చెలికోసం
నా ఎదలోనా ఏ దేవతో రాసిందిలే ప్రేమాక్షరీ
గుండెల్లోనే పుట్టిందమ్మా గోదావరీ
కన్నుల్లోనే పొంగిందమ్మా గంగాఝరీ
నా ఒడి చేరీ ఓ లాహిరీ నాలో పాడే నీలాంబరీ

ఋతువుకొక్క రుచిని చూపే ఈ అందం
మ్మ్ ఆ లలలలా
మదిని జల్లే మల్లెవిరుల మకరందం
మ్మ్ఏ ఆఆ
చిలక పాపలెగసి చదివే శుభమంత్రం
అలరేగె కలగానె తొలిమోహం
ఎన్నిటికైనా ఆ దేవకి కావాలిలే ప్రాణేశ్వరీ
గుండెల్లోనే పుట్టిందమ్మా గోదావరీ
కన్నుల్లోనే పొంగిందమ్మా గంగాఝరీ
నా ఒడి చేరీ ఓ లాహిరీ నాలో పాడే నీలాంబరీ



Credits
Writer(s): M. M. Keeravani, Veturi Sundararama Murthy
Lyrics powered by www.musixmatch.com

Link