Jum Jum Maya

రాత్రయినా పడుకోలేను
పడుకున్నా నిదరేరాదు
నిదరొస్తే కలలే కలలు
కలలోన నవ్వే నువ్వు
జుంజుం మాయ జుంజుం మాయ
ప్రేమిస్తేనే ఇంతటి హాయా
జుంజుం మాయ జుంజుం మాయ
ప్రేమిస్తేనే ఇంతటి హాయా

పగలైనా లేవలేను
లేచినా బైటికి రాను
వచ్చినా నాకే నేను ఎందుకో అర్థం కాను
జుంజుం మాయ జుంజుం మాయ
ప్రేమిస్తేనే ఇంతటి హాయా
జుంజుం మాయ జుంజుం మాయ
ప్రేమిస్తేనే ఇంతటి హాయా

పొద్దుగడవకుందిరా తస్సాదియ్యా
ఏమి పెట్టమందువే tea coffeeయా

ఊసులేవో చెప్పొచ్చుగా ఓ మగరాయ
తెల్లవార్లు కబురులే సరిపోతాయా
గీత గీసి ఆటలెన్నో ఆడచ్చయ్యా
గీత దాటాలనిపిస్తే మరి నేనేం చెయ్య
అయ్యయ్యో బ్రహ్మయ్య నా వల్ల కాదయ్యా
నీ దూకుడుకడ్డే వెయ్య
జుంజుం మాయ జుంజుం మాయ
ప్రేమిస్తేనే ఇంతటి హాయా

I can see nothing nothing
I can hear nothing nothing
I can feel nothing nothing
I can go nowhere nowhere
జుంజుం మాయ జుంజుం మాయ
ప్రేమిస్తేనే ఇంతటి హాయా

గడపనా నీతో గంటలకొద్దీ
అయ్ బాబోయ్ ఆ తర్వాత ఏమైపోద్ది

ఐదే నిమిషాలైనా అది సరిపోద్ది
ఆశ దోసె అప్పడం ఇది ఏం బుద్ది
మరి ఎట్టా మన ప్రేమ ముదిరే కొద్దీ
ముద్దులతో సరిపెట్టు బుగ్గలు రుద్ది
తర్వాత ఏమైన నా పూచి కాదని చెబుతున్నా బల్లను గుద్ది
జుంజుం మాయ జుంజుం మాయ
ప్రేమిస్తేనే ఇంతటి హాయా

అయ్యయ్యయ్యయ్యయో తిరుపతి ఎంకన్నసామి
అన్నారం సత్తెనసామి
యాదగిరి నరసింహసామి నా గతి ఏమిఏమి
జుంజుం మాయ జుంజుం మాయ
ప్రేమిస్తేనే ఇంతటి హాయా
జుంజుం మాయ జుంజుం మాయ
ప్రేమిస్తేనే ఇంతటి హాయా



Credits
Writer(s): Rajesh Ramanath, Kaviraj Kaviraj, Keeravaani M M
Lyrics powered by www.musixmatch.com

Link