Telipedelaga (From "Nee Kosam")

తెలిపేదెలాగా ఎద వేదన
తెలిసేదెలాగా ఈ యాతన
కలిసేదెలాగా తన చెంతన
కలిశాక తానే మన్నించునా
కథ మొదలాయే ముగిసే తుది వేళలో
కథ ముగిసేన చెలి జత చేరక ఇపుడే
ఉసురే కసిగా కసిరే సమయం
కడలై ఎగసే హృదయం
తెలిపేదెలాగా ఎద వేదన
తెలిసేదెలాగా ఈ యాతన

ఎవరిని వెతుకుతూ ఎద లయ కదిలెను
వివరము తెలిసెనా ఇప్పటికి
వెలుగుల దిశ ఎటో మనసును అడుగుతూ
అడుగులు సాగెనా ఆఖరికి
ఇంతలో వింతలా ఇంతకేంమైందిలా ప్రాణమాగిపోయేటంతలా
నిండు చేజేతులా నిన్ననొదిలేసిలా తీరు అంటూ లేక తీరమెంట సాగు
తనతో తనకే జరిగే సమరం
చెలిమే గెలిచే తరుణం
తెలిపేదెలాగా ఎద వేదన
తెలిసేదెలాగా ఈ యాతన
కథ మొదలాయే ముగిసే తుది వేళలో
కథ ముగిసేన చెలి జత చేరక ఇపుడే
తనతో తనకే జరిగే సమరం
చెలిమే గెలిచే తరుణం



Credits
Writer(s): Srinivas Sharma, M Sagar Narayana
Lyrics powered by www.musixmatch.com

Link