Hrudhayam Jaripe

నువు నడిచే ఈ నేల పైనే
నడిచాన ఇన్నాళ్ళుగానే
ఈ క్షణమె ఆపాలనున్నది ఈ భూభ్రమణమే
నీ చెలిమి వద్దంటు గతమే
బంధీగ చేసింది నన్నే
తక్షణమె చెయ్యాలనున్నది తనతో యుద్ధమే
ఇవ్వాళే తెగించా
ఇదేనేమో స్వేచ్ఛ
తెలికే తెంచావే నా ఇన్నాళ్ల సంకెళ్లనే

(హృదయం జరిపే తొలి తిరుగుబాటిది
నిను దాయడమే తన జన్మ హక్కని
ఒంటరి తనపు ఖైదినిక వద్దనీ నన్నొదిలెనే
ఇది వరకేపుడు నా ఉనికినెరగని దుర్భేధ్యాల నీ మనసు కోటని
ముట్టడి చేసి గెలిచేందుకొచ్చెనే నా హృదయమే)

ఏకాంతమంత అంతం అయేంత
ఓ చూపు చూడే చాలికా
మరు జన్మ సైతం రాసేసి ఇస్తా
నా రాజ్యమంతా ఏలికా
నీ మౌనంలో దాగున్న ఆ గరళమే
దాచేసి అవుతున్నా నేనచ్చంగా ముక్కంటినే

(హృదయం జరిపే తొలి తిరుగుబాటిది
నిను దాయడమే తన జన్మ హక్కని
ఒంటరి తనపు ఖైదినిక వద్దనీ నన్నొదిలెనే
ఇదివరకేపుడు నా ఉనికీనెరగని దుర్భేధ్యాల నీ మనసు కోటని
ముట్టడి చేసి గెలిచేందుకొచ్చెనే నా హృదయమే)



Credits
Writer(s): Krishna Kanth, Vishal Chandrashekar
Lyrics powered by www.musixmatch.com

Link