Kalala Kadhala

కలలా కథలా ఎందుకో అలా
నువ్ ఎటు వెళ్లిపోయావో
శిలలా మిగిలి ఉన్నా నేనిలా
నువ్ ఎపుడెదురౌతావో
ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా చెరగదు నీ తలపు
నీ తలపే తూరుపుగా తెల్లారెను ప్రతి రేపు
ఏ దూరంలో ఏ వైపున్నా వింటావా నా పిలుపు

చిరు చిరు నవ్వా పరుగున రావా
చిన్ననాటి నేస్తంలా చేరుకోవా
చిరు చిరు నవ్వా పరుగున రావా
చిన్ననాటి నేస్తంలా చేరుకోవా

నిను వెతకని చోటే లేదు నువ్వే లేక వెలుగే లేదు
నిను మరచిన రోజే లేదు నువ్వే లేని క్షణమే చేదు
నీ జాడ దొరకని కన్నులకి
కన్నీరు ముసిరిన నా కలకి
నీ పేరే వినిపిస్తూ ముందడుగై వెళుతున్నా

వేయి జనుమల బంధం అంటూ ఎన్నో ఎన్నో అనుకున్నాను
ఎద రగిలిన శూన్యంలాగా నాతో నేనే మిగిలున్నాను
ఎడారి దారుల వేసవిగా
తడారి పోయిన గొంతుకగా
నీ కొరకై నిరీక్షణగా వున్నానంటే వున్నా



Credits
Writer(s): S.s. Thaman, Ramajogayya Sastry
Lyrics powered by www.musixmatch.com

Link