Amma Naana

అమ్మ నాన్న లేని పసివాళ్లు
అయినా అన్నీ ఉన్నోళ్లు
నింగి నేల వీరి నేస్తాలూ
కొమ్మా రెమ్మా చుట్టాలూ
ఈ ఆడి పాడే పాండవులు
కలతే లేని మహారాజులు
ఈ బంధం లేని బంధువులు
కలిసుంటారంట ఎనలేని రోజులు
లాలీజో లాలీజో
లాలీజో లాలీజో

కదిలే దేహాలే ఐదయినా
ప్రాణం మాత్రం ఒకటేగా
వేరు మూలాలన్నీ వేరయినా
వెళ్లే మార్గం మాత్రం ఒకటేగా
ఒక రక్తం కానే కాకున్నా
అంతకన్నా మిన్నై కలిసారుగా
ఈ బంధం పేరే వివరంగా
వివరించే మాటే జన్మించలేదుగా
లాలీజో లాలీజో
లాలీజో లాలిజో



Credits
Writer(s): Ramajogayya Sastry, G Devi Sri Prasad
Lyrics powered by www.musixmatch.com

Link