Nee Kaatuka Kannulatho

నీ కాటుక కన్నులలో ఏ కమ్మని కథ వుందో
చెలియా వినిపించవా చెవిలో చెవిలో చెవిలో
నా కాటుక కన్నులలో ఏ కమ్మని కథ వుందో ఓ
మదిలో వినిపించనా ఇదిగో ఇదిగో ఇదిగో

పులకించే నీ మనసే చిలిపిగ చిందులు వేసిందా
పులకించే నీ మనసే చిలిపిగ చిందులు వేసిందా
నడిరేయీ నను తలచి తడబడి దిక్కులు చూసిందా
నాలో చెలరేగే తలపే నా మాట వింటుందా
నాలో చెలరేగే తలపే నా మాట వింటుందా
ఏ రేయీ ఏ పగలయినా నిను తలవని క్షణముందా
నిను తలవని క్షణముందా
నీ కాటుక కన్నులలో ఏ కమ్మని కథ వుందోఓ
మదిలో వినిపించనా ఇదిగో ఇదిగో ఇదిగో

అధరాలూ హృదయాలూ అల్లన గుస గుస లాడాలి
అధరాలూ హృదయాలూ అల్లన గుస గుస లాడాలి
పొదరింటా మనజంటా పులై ఘుమ ఘుమ లాడాలియీ
పల్లవించు అనురాగంలో పరిమళాలు నిండాలియీ
పల్లవించు అనురాగంలో పరిమళాలు నిండాలి
పరిమళాల దారులలోన బ్రతుకంత పండాలి
బ్రతుకంత పండాలి
నా కాటుక కన్నులలో ఏ కమ్మని కథ వుందో ఓ
చెలియా వినిపించానా చెవిలో చెవిలో చెవిలో
ఆ హాహా ఆ హాహాహా
ఆహాహాహా అహహా హా



Credits
Writer(s): Dr. C Narayana Reddy, T.v. Raju
Lyrics powered by www.musixmatch.com

Link