Cheliya Paluke Palike (From "Sumanoharam")

చెలియ పలుకే పలికే మనసే మురిసే
ఎదనే వెతికే చెలిమే జతగా కలిసే
నీవే నీవే నాతో గడిపే క్షణమే
మునుపే ఎపుడూ వినని తియ్యని స్వరమే
సఖియా తొలి కలవరమే కలిగే చూసిన క్షణమే
అడుగే మరి తడబడెనే ఎదో మాయే
అధరం చిరు సుమధురమే
కనులే కలిపే జగమే
కలలే నిజమైనాయే
నాలో హాయే
చెలియ పలుకే పలికే మనసే మురిసే
ఎదనే వెతికే చెలిమే జతగా కలిసే
నీవే నీవే నాతో గడిపే క్షణమే
మునుపే ఎపుడూ వినని తియ్యని స్వరమే

ఎదలో ఎపుడూ తపనే లేదే
మదిలో ఇపుడే మొదలైనది
నను నే మరిచే జతనే చేరి
కలలే నిజమై తనలా మారేనే
తలచే నను వలచే తన తొలి చూపులే
జడిలో మధువనిలా మరి తన మాటలే
అరెరే తన పరిచయమే నాలో తొలి పరవశమే
విరిసే మరి దరహాసమే పెదవులపైనే
అడుగే పద పదమంటూ వెనకే పరిగెడుతుందే
మనమే ఇక జంటయ్యి సాగాలందే
చెలియ పలుకే పలికే మనసే మురిసే
ఎదనే వెతికే చెలిమే జతగా కలిసే
నీవే నీవే నాతో గడిపే క్షణమే
మునుపే ఎపుడూ వినని తియ్యని స్వరమే



Credits
Writer(s): Mihiraamsh, Sri Siraag
Lyrics powered by www.musixmatch.com

Link