Nammela Ledhe (From "Raja Vaaru Rani Gaaru")

నమ్మేలా లేదే
కల కాదే
మనసే మేఘమాయే
కమ్మేసిందేదో ఒక హాయే
చినుకే భారమాయే
ఇయ్యాలనుంది గాని
ఉయ్యాలలూగేటి మేఘమా
జాగెందుకే సరాసరి పంపించు చిన్నారి చినుకుని
నా పెదవికి కనులతో కలహమా
నా మనసుని వదలవే బిడియమా

సీత చూపే రామ బాణం అయినదేమో కదా
దారేది లేక నవ్వుతూనే నలుగుతోంది ఎద
నా మనసుని కోసే సుతారమా కాసేపైనా ఆగుమా
ఓ కాలమా వేళాకోళమా
జంటై ఉంటే నేరమా
నా పెదవికి కనులతో కలహమా
నా మనసుని వదలవే బిడియమా

పల్లెటూరే పర్ణశాలై వెలుగుతోంది ఎలా
గుమ్మాన్ని దాటే ఒలిపిరల్లె తుళ్ళిరాకే ఇలా
నా నడకని ఆపే నిధానమా
నీదే నాదం నాట్యమా
ఓ దూరమా నాతో వైరమా
తారాతీరం చేరుమా
నా పెదవికి కనులతో కలహమా
నా మనసుని వదలవే బిడియమా



Credits
Writer(s): Sanapati Bharadwaj Patrudu, Jay Krish
Lyrics powered by www.musixmatch.com

Link