Kathaa Naayaka (From "Ntr Biopic")

ఘన కీర్తిసాంద్ర విజితాకిలాంద్ర
జనతాసుదీంద్ర మణి దీపక

ఘన కీర్తిసాంద్ర విజితాకిలాంద్ర
జనతాసుదీంద్ర మణి దీపక
త్రిశతకాధిక చిత్రమాలిక
జైత్రయాత్రిక కథానాయక

ఘన కీర్తిసాంద్ర విజితాకిలాంద్ర
జనతాసుదీంద్ర మణి దీపక
త్రిశతకాధిక చిత్రమాలిక
జైత్రయాత్రిక కథానాయక

ఆహార్యాంగిక వాచిక పూర్వక
అద్భుత అతులిత నటనా ఘటిక
భీమసేన వీరార్జున
కృష్ణ దానకర్ణ మానధన సుయోధన
భీష్మ బృహన్నల విశ్వామిత్ర
లంకేశ్వర దశకంఠ రావణాసురాధి
పురాణ పురుష భూమిక పోషక
సాక్షాత్ సాక్షాత్ కారక
త్వదీయ ఛాయ చిత్రచ్చాదిత
రాజిత రంజిత చిత్రయవనిక
నైధం పూర్వక రసోత్పాదక
కీర్తికన్యక మనోనాయక
కథానాయక
కథానాయక

(ఘన కీర్తిసాంద్ర విజితాకిలాంద్ర
జనతాసుదీంద్ర మణి దీపక
త్రిశతకాధిక చిత్రమాలిక
జైత్రయాత్రిక కథానాయక)

(జయహో జయహో
జయహో జయహో
జయహో జయహో)



Credits
Writer(s): M.m. Keeravani, K. Shiva Datta, K. Rama Krishna
Lyrics powered by www.musixmatch.com

Link