Vacchindi Kada Avakasam

వచ్చింది కదా అవకాశం
ఓ మంచి మాట అనుకుందాం
ఎందుకు ఆలస్యం
అందర్నీ రమ్మందాం
బంగారు బంగారు బంగారు బంగారు
బంగారు బంగారు బంగారు బంగారు
బంగారు బంగారు బంగారు బంగారు

బంగారు బంగారువే
సంగీతంలో స ప స
రాకపోతే ఏం లోటా
సంతోషంలో హైలెస్సా
అంటే ఏదో పొరపాట
Attention everybody
సరదాగా సై ఆడండి
ABCD చాలండి

Anybody can dance అండి

సంగీతంలో స ప స
రాకపోతే ఏం లోటా

సంతోషంలో హైలెస్సా
అంటే ఏదో పొరపాట

ఏ ఆనందమంటే పైనేదో లేదే
మనలోనే దాగుంది
చిరు నవ్వు దీపం వెలిగించి చూస్తే
మనకే తెలుస్తుంది
ఆట పాట hello అంటే ఆలోచిస్తూ ఎటో చూడకు
సరేలే సరదా సాకులెందుకు
ఏ పూటంటే ఆ పూటే
ఏ చోటంటే ఆ చోటే

Happy గా ఉండాలంటే
ఉండాలనుకోవాలంతే

భూగోళమంతా మోసే పనేదో మన మీదనే ఉందా
లోకాన ఉండే చికాకు మొత్తం
మన కొరకే పుట్టిందా
ఎవరికి వారే ఏదో మూల ఏకాంతంగా ఉంటారేంటలా

పలుకే కరువై మూగ నోములా
అనుకుందేదో కాదంటే
ఇంకేదో అవుతూ ఉంటే
కానీలే అన్నామంటే
కష్టం నీకిచ్చేస్తుందే
Attention everybody
సరదాగా సై ఆడండి
ABCD చాలండి
Anybody can dance అండి



Credits
Writer(s): Mickey J Meyer, Sirivennela Shastry
Lyrics powered by www.musixmatch.com

Link