Sooryudu Evarayya

సూర్యుడు ఎవరయ్యా... మన అందరి బంధువయా
చంద్రుడు ఎవరయ్యా... మన అందరి బంధువయా

సూర్యుడు ఎవరయ్యా... మన అందరి బంధువయా
చంద్రుడు ఎవరయ్యా... మన అందరి బంధువయా

నేల నింగి నీరూ నిప్పు ఊపిరినిచ్చే గాలి
తమ తమ స్వార్ధం చూసుకుంటె మన గతి ఏం కావాలీ
కొంచెం పంచవయా. నువు అందరి బంధువయా
మంచిని పెంచవయా. నువు అందరి బంధువయా

జగతికి ప్రేమను పంచుటకోసం శిలువను ఎక్కిన జీసస్. జీసస్
సత్యం కోసం విషం తాగి సందేశమిచ్చిన సోక్రటీస్
అహింస ఏ తన గొప్ప ఆయుధం అని నిరూపించిన గాంథీ
తమకు ఎప్పుడూ ఏమి కాని జనం కోసమే తపించి
సుఖాలు సర్వం త్యజించి మహాత్ములై నిలిచారు
వీరంతా ఎవరయా. మనలాగే మనుషులయా
జాతికి వరములయా. మన అందరి బంధులయా



Credits
Writer(s): Anup Rubens, Chaithanya Prasad
Lyrics powered by www.musixmatch.com

Link