La La La La (From "Iddari Lokam Okate")

లాల లాల లా నిజంలా నా కల
లాల లాల లా నీవల్లే నేనిలా
కనుపాపకిన్ని కాంతులా, చిరునవ్వుకిన్ని చిందులా
ఒక నిన్నలోంచి నన్ను కోరి పూసే నేడిలా
ఓ రెండు ఊహలు, ఓ రెండు ఊసులు కలిసాయిలా
ఓ రెండు మనసులు, ఓ రెండు వరసలు ఒక పరుగులా
ఓ రెండు ఊహలు, ఓ రెండు ఊసులు కలిసాయిలా
ఓ రెండు మనసులు, ఓ రెండు వరసలు ఒక పరుగులా
లాల లాల లా నిజంలా నా కల
లాల లాల లా నీవల్లే నేనిలా

చుక్కలందుకున్న రెక్కలా
చిక్కు తెంచుకున్న లెక్కలా
వెన్నెలద్దుకున్న రేయిలా ఉన్నానివాళ
ఒక్కొక్కొ క్షణమిలా, ఒక్కొక్కొ ఋతువులా మారుతోందిలా
నీవెంటే అడుగని, నీకంటే ఎవరని అడుగుతున్న మదిలా
ఓ రెండు ఊహలు, ఓ రెండు ఊసులు కలిసాయిలా
ఓ రెండు మనసులు, ఓ రెండు వరసలు ఒక పరుగులా
ఓ రెండు ఊహలు, ఓ రెండు ఊసులు కలిసాయిలా
ఓ రెండు మనసులు, ఓ రెండు వరసలు ఒక పరుగులా
చెప్పలేని మాటలన్నీలా చెప్పమంటూ గొడవే ఎలా
విప్పమంటూ పెదవే ఇలా పదాలు చాలా
నీ నీడ భుజముపై నా నీడ హాయిగా తలను వాల్చెలా
ఇన్నాళ్ళ ప్రేమలో ఈ ప్రేమ లేదని తెలుసుకున్న మదిలా
ఓ రెండు ఊహలు, ఓ రెండు ఊసులు కలిసాయిలా
ఓ రెండు మనసులు, ఓ రెండు వరసలు ఒక పరుగులా
ఓ రెండు ఊహలు, ఓ రెండు ఊసులు కలిసాయిలా
ఓ రెండు మనసులు, ఓ రెండు వరసలు ఒక పరుగులా

Credits
Writer(s): Sri Mani, Mickey J. Meyer
Lyrics powered by www.musixmatch.com

Link