Devathala Nenu

దేవతలా నిను చూస్తున్నా
దీపంలా జీవిస్తున్నా
నా ప్రాణం నువు తీస్తున్నా
నీ ధ్యానం నే చేస్తున్నా
ఎవరమ్మా నువ్వెవరమ్మా
ఇంతకీ నాకు నువ్వెవరమ్మా

ఎగిరి ఎగిరిపోయింది సీతాకోకచిలక
మిగిలింది వేళ్ళపై అది వాలిన మరక
ఎగిరి ఎగిరిపోయింది సీతాకోకచిలక

మిగిలింది వేళ్ళపై అది వాలిన మరక

ఆరారో... ఆరారో... ఆరారో... ఓ... ఆరారో...
దేవతలా నిను చూస్తున్నా

దీపంలా జీవిస్తున్నా

సుడిగాలికి చిరిగినా ఆకు అలగదు
చెలి చూపుకు నలిగినా మనసు మరవదు
నీ ఒడిలో చేరలేని నా ఆశలు
ఒడిదుడుకుల ఉడుకెత్తిన నా శ్వాసలు
ఎండమావిలో సాగే పూల పడవలు
గుండె దాచుకోలేని తీపి గొడవలు

అందీ అందని దాన అందమైన దానా

అంకితం నీకే అన్నా నను కాదన్నా
ఆరారో... ఆరారో... ఆరారో... ఓ... ఆరారో...
దేవతలా నిను చూస్తున్నా
దీపంలా జీవిస్తున్నా

నా ప్రాణం నువు తీస్తున్నా
నీ ధ్యానం నే చేస్తున్నా

నిప్పును పువ్వనుకుంటే తుమ్మెద తప్పు
నెమలి కన్ను మనసు చూడలేదని చెప్పు
నీ వెన్నెల నీడలైన నా ఊహలు
నీ కన్నులు మాటాడిన నీలి ఊసులు
ఈ సమాధిపై పూసే సన్నజాజులు
నిదర రాని నిట్టూర్పుల జోలపాటలు
చక్కనైన చినదాన దక్కని దానా
రెక్కలు కట్టుకు రానా తెగిపోతున్నా
ఆరారో... ఆరారో... ఆరారో... ఓ... ఆరారో...



Credits
Writer(s): Veturi, Vidyasagar
Lyrics powered by www.musixmatch.com

Link