Nee Maata Thelipe

నీ మాట తెలిపే భాషేమిటో
నాకు నీ చూపు తెలిపే దారేమిటో

నీ తోడు తెలిపే నేనేమిటో
నీ అడుగు తెలిపే నడకేమిటో
దూరమే తెలిపే బాదేమిటో

నీ మాట తెలిపే భాషేమిటో
నాకు నీ చూపు తెలిపే దారేమిటో
వేసవిన చిరుజల్లు కురిపించి పోయే
మేఘమెటో సాగినది ఎందుకనో
గంధాలు వెదజల్లే అందాల పువ్వులే
వాడినవీ రాలినవీ ఎందుకనో
రాగమైన రవళి తనే
మూగబోయె ఎందుకనీ
మేలుకొలుపు వెలుగు తనే
కానరాదు ఎంత కని
జీవితాన్ని తిరిగిచ్చీ తిరిగిరాని పయనమెటో

నీ మాట తెలిపే భాషేమిటో
నాకు నీ చూపు తెలిపే దారేమిటో
కలగంది కన్నేగా మనసుదే నేరమా
మమతిలా తరిమితే ఏమవనూ
చిరునవ్వులెన్నేన్నో దాచాను నేస్తమా
కన్నీరుగా మారినవీ ఏంచేయనూ
పూలతోట ఉన్నదనీ
ముళ్ల బాట నడచితినీ
చేదు పాట తియ్యననీ
ఉన్నమాట మరచితిని
వెతుకులాట బతుకులలో
బతుకు మాట అతుకులలో

నీ మాట తెలిపే భాషేమిటో
నాకు నీ చూపు తెలిపే దారేమిటో
నీ తోడు తెలిపే నేనేమిటో
నీ అడుగు తెలిపే నడకేమిటో
దూరమే తెలిపే బాదేమిటో
నీ మాట తెలిపే భాషేమిటో
నాకు నీ



Credits
Writer(s): Vidya Sagar, Sasank Vennelakanti
Lyrics powered by www.musixmatch.com

Link