Manasavacha

మనసా వాచా కర్మణ
నిను ప్రేమించా
నా మనసనే ఢిల్లీ కోటకు
నిన్నే రాణిని చేశా
కర్త కర్మ క్రియ
నాకు నువ్వే ప్రియా
నా వలపుల సీమకు రాజువి
నువ్వే రారా దోరా
కదిలే వెన్నెల శిల్పం నీవని
కన్నుల కొలువుంచా
కురిసే మల్లెల జడిలో
ప్రేయసి నువ్వేనని తలచా
మదనుడు పంపిన వరుడే నువ్వని
మనవే పంపించా నా మనసే అర్పించా

మనసా వాచా కర్మణ
నిను ప్రేమించా
నా మనసనే ఢిల్లీ కోటకు
నిన్నే రాణిని చేశా
కర్త కర్మ క్రియ
నాకు నువ్వే ప్రియా
నా వలపుల సీమకు రాజువి
నువ్వే రారా దొరా
దిక్కులు నాలుగని అందరూ అంటున్నా
కాదు ఒక్కటేనని నిన్నే చూపిస్తా
ప్రాణాలు ఐదు అని ఎందరో చెబుతున్నా
ఒకటే ప్రాణమని మననే చూపిస్తా
ఎన్నడు వాడిని ప్రేమకు ఋతువులు
ఆరే కాదమ్మా
జంటగ సాగుతూ పెళ్లికి ఏడే
అడుగులు వేద్దామా
అష్టైశ్వర్యం మనకందించే వరమే
ఈ ప్రేమా
ప్రేమకు మనమే చిరునామా

మనసా వాచా కర్మణ
నిను ప్రేమించా
నా మనసను ఢిల్లీ కోటకు
నిన్నే రాణిని చేశా
కన్నులు ఉన్నవిలా నిను చూసేటందుకులే
నా కంటికి వెలుతురులా
నువ్వుంటే చాల్లే
పెదవులు ఉన్నవిలా
నిను పిలిచేటందుకులే
ఆ పిలిచే పేరోకటే నీదైతే చాల్లే
పాదం ఉన్నది కడవరకు
నీతో నడిచేందుకులే
అందం ఉన్నది
నీ కౌగిట్లో అలిసేటందుకులే
హృదయం ఉన్నది నిన్నే
తనలో దాచేటందుకులే
అది ఇక సొంతం నాకే

మనసా వాచాకర్మణ
నిను ప్రేమించా
నా మనసను ఢిల్లీ కోటకు
నిన్నే రాణిని చేశా
కర్త కర్మ క్రియ
నాకు నువ్వే ప్రియా
నా వలపుల సీమకు రాజువి
నువ్వే రారా దోరా

మనసా వాచా కర్మణ
నిను ప్రేమించా
నా మనసను ఢిల్లీ కోటకు
నిన్నే రాణిని చేశా

మనసా వాచా కర్మణ
నిను ప్రేమించా
నా మనసను ఢిల్లీ కోటకు
నిన్నే రాణిని చేశా



Credits
Writer(s): Vandemataram Srinivas, Kaluva Krishna Sai
Lyrics powered by www.musixmatch.com

Link