Singarala Seeta Devi (From "Pakka Mass")

(सुनो पिया... मेरे पिया)
(ओ पिया)
సింగారాల సీతా దేవి
విన్నవిస్తా చిన్న మనవి
రాముళ్ళాగా రాసిచేస్తా
నా గుండెల్లో రాణి పదవి

సింగారాల సీతా దేవి
విన్నవిస్తా చిన్న మనవి
రాముళ్ళాగా రాసిచేస్తా
నా గుండెల్లో రాణి పదవి
నిదరే కాజేస్తివే
కుదురే గుంజేస్తివే
నన్నే పడదోస్తివే ప్రేమ లోకంలో
నింగి హరివిల్లులో వర్ణాలే తీస్తివే
పిచికారి చేస్తివే పిల్లా నా కల్లో
గగన సుందరి, గగన సుందరి
ఎగిరొచ్చా నిన్ను కోరి గగన సుందరి
గగన సుందరి, నా గగన సుందరి
దిగి రావే నేల జారి గగన సుందరి

నా గుండె గుప్పెడంత చాలేదెలా
ఆకాశమంత ప్రేమ దాచేదెలా
మౌనాల దూరమంతా దాటేదెలా
మనసైన ఊసులన్నీ తెలిపేదెలా
క్రీఘంట చూస్తివే
జాదూ చేసేస్తివే
జెండా ఎగిరేస్తివే నన్నే గెలిచేసి
నన్నేదో చేస్తివే
నీలో దాచేస్తివే
తాళాలెగరేస్తివే తలుపే మూసేసి
గగన సుందరి, గగన సుందరి
ఎగిరొచ్చా నిన్ను కోరి గగన సుందరి
గగన సుందరి, నా గగన సుందరి
దిగి రావే నేల జారి గగన సుందరి



Credits
Writer(s): Darivemula Ramajogaiah, Ravi Basrur
Lyrics powered by www.musixmatch.com

Link