Vooni Vesukunna

ఓణీ వేసుకున్న పూలతీగ ఊగుతుంటే ਬੱਲੇ ਬੱਲੇ
బోణీ చేసుకున్న తేనెటీగ తూగుతుంటే ਬੱਲੇ ਬੱਲੇ
రాణీకాసులన్నీ కళ్ళనిండా రాలుతుంటే ਬੱਲੇ ਬੱਲੇ
కానీ ఖర్చులేని అల్లరిట్టా తుళ్ళుతుంటే ਬੱਲੇ ਬੱਲੇ

ये है चाँद का टुकड़ा
ఏదో చెయ్యవేంది పోరడా
నీకు ఆశ ఉంటే చెయ్యివెయ్యి చెప్పకుండా
ఇట్టే అందుతుంది చంద్రవంక తప్పకుండా

ఓణీ వేసుకున్న పూలతీగ ఊగుతుంటే ਬੱਲੇ ਬੱਲੇ
బోణీ చేసుకున్న తేనెటీగ తూగుతుంటే ਬੱਲੇ ਬੱਲੇ

నీకు ఆశ ఉంటే చెయ్యివెయ్యి చెప్పకుండా
ఇట్టే అందుతుంది చంద్రవంక తప్పకుండా

మణులున్న గనిలాంటి నిగనిగల సిరి వగల
కలవారి కామాక్షి నువ్వే కదా
కలలంటి కళలన్నీ మా కళ్ళకిచ్చేసి
నిరుపేద లోలాక్షివయ్యావుగా
బట్టల్లో పొదుపంటే నాకిష్టం
అందాలపై అదుపు అంతే కష్టం
బొత్తాలు మానేసి లోకానికి
చిన్నిమొత్తాల పొదుపుంటే చూపావులే

ఓణీ వేసుకున్న పూలతీగ ఊగుతుంటే ਬੱਲੇ ਬੱਲੇ
బోణీ చేసుకున్న తేనెటీగ తూగుతుంటే ਬੱਲੇ ਬੱਲੇ

ये है चाँद का टुकड़ा
ఏదో చెయ్యవేంది పోరడా
నీకు ఆశ ఉంటే చెయ్యివెయ్యి చెప్పకుండా
ఇట్టే అందుతుంది చంద్రవంక తప్పకుండా

నిరసనిదప మాదపమగారి
పాసనీరి సనిదప మదపమ గమగరిస
పమా మదప రిమాదానిదా మాపమా

(ਬੱਲੇ ਬੱਲੇ ਬੱਲੇ ਬੱਲੇ ਬੱਲੇ ਬੱਲੇ ਬੱਲੇ ਬੱਲੇ ਬੱਲੇ ਬੱਲੇ ਬੱਲੇ ਬੱਲੇ ਬੱਲੇ ਬੱਲੇ ਬੱਲੇ)

తల్వారు తళుకుల్తో నిలువెల్లా తోస్తుంటే
ఆ తీపిగాయాలు మానేదెలా
జలతారు సొంపుల్తో జాదూలు చేస్తుంటే
ఆ చిలిపి జాతర్ని ఆపేదెలా
ఇన్నిన్ని అందాలు నా నేరమా
జాలేసి చూపిస్తే నిష్ఠూరమా
నీకున్న జనశక్తి సామాన్యమా
నిన్ను చూశాక మతి చెడితే విడ్డూరమా

ఓణీ ఓణీ వేసుకున్న పూలతీగ ఊగుతుంటే ਬੱਲੇ ਬੱਲੇ
బోణీ చేసుకున్న తేనెటీగ తూగుతుంటే ਬੱਲੇ ਬੱਲੇ

ये है चाँद का टुकड़ा
ఏదో చెయ్యవేంది పోరడా
నీకు ఆశ ఉంటే చెయ్యివెయ్యి చెప్పకుండా
ఇట్టే అందుతుంది చంద్రవంక తప్పకుండా

ఓణీ వేసుకున్న పూలతీగ ఊగుతుంటే ਬੱਲੇ ਬੱਲੇ
బోణీ చేసుకున్న తేనెటీగ తూగుతుంటే ਬੱਲੇ ਬੱਲੇ
నీకు ఆశ ఉంటే చెయ్యివెయ్యి చెప్పకుండా
ఇట్టే అందుతుంది చంద్రవంక తప్పకుండా



Credits
Writer(s): Ramajogayya Sastri, Jessigift
Lyrics powered by www.musixmatch.com

Link