Gundelona Gayam - Duet

గుండెలోన గాయం కానరాదులే
చెప్పుకున్నా బాధ తీరిపోదులే
ప్రేమ కల నిజం అయ్యేదెపుడో
ఆశపడే జత కలిసేదెపుడో
విధి రాత మారేదెపుడో
తొలి ప్రేమ నిలిచేదెపుడో
గుండెలోన గాయం కానరాదులే
చెప్పుకున్నా బాధ తీరిపోదులే

ఒక నయనంలోన కలతే ఉన్నా
మరు నయనం కూడా కన్నీరొలికే
ఎద లోతుల్లోన ఈ ప్రేమెంతున్నా
దాచుంచేటి ఈ మైనము
ఇరు దేహాలున్నా ఒక ప్రాణం అయినా
పయనించేటి ప్రియ గమ్యము
ఇక చేరేది ఏనాటికో
దరి చేర్చేది ఏ దీవెనో
గుండెలోన గాయం కానరాదులే
చెప్పుకున్నా బాధ తీరిపోదులే

ప్రేమించిందొకరు తోడున్నదొకరు
ఆశించిందొకరు శాసించిందింకొకరు
ప్రేముకులాడే ప్రేమాటలే అయినా
ఈ హృదయాల గెలుపెన్నడో
ఎడబాటే వరమా, ఎదలే మౌనమా
ప్రియ స్వప్నాల రుజువెన్నడో
ఆనందాల వెలుగెన్నడో
మది ఊరించే మలుపెన్నడో
గుండెలోన గాయం కానరాదులే
చెప్పుకున్నా బాధ తీరిపోదులే
గుండెలోన గాయం కానరాదులే
చెప్పుకున్నా బాధ తీరిపోదులే
ప్రేమ కల నిజం అయ్యేదెపుడో
ఆశపడే జత కలిసేదెపుడో
విధి రాత మారేదెపుడో
మన ప్రేమ గెలిచేదెపుడో
గుండెలోన గాయం కానరాదులే
చెప్పుకున్నా బాధ తీరిపోదులే



Credits
Writer(s): Rajkiran, M Rama Rao
Lyrics powered by www.musixmatch.com

Link