Adugasale

అడుగసలే నిలవదులే
నా గుండె వదిలేస్తే
అలవాటే అయినదిలే
కన్నీరే రాలదులే

నువ్వు లేవని బరువే దిగదే
ఇక రావని మనసే వినదే
తప్పే నాదే
ప్రేమే పోదే

వచ్చి పోయే వానల్లే నీవైనావే
నేనేమో నేలల్లే ఉన్నాలే
చూస్తూనే మారేటి కాలమే నీవే
నేనేమో ఆగున్న నింగేలే

నీ ప్రేమనే మించిన బాధేమిటే
నా ప్రాణమే పంచనా నువ్వు కోరితే
నా గుండెనే చీల్చెనా నీలో మౌనమే
మాటాడితే గాయమే మానేనే

ఊపిరిలో ఉన్నావే, నిశ్వాసై పోతావే
ఒంటరిగా నే లేనే, నాతోనే ఉంటావే
ఊహల్లో కూడాను, నువ్వు లేక నే లేనే
ఒట్టేసి అంటున్నా, నువ్వే నేనే



Credits
Writer(s): Krishnakanth, Shravan Bharadwaj
Lyrics powered by www.musixmatch.com

Link