Aadinchi Ashta Chamma

ఆడించి అష్ట చెమ్మా ఓడించావమ్మా
నీ పంట పండిందే ప్రేమా
నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే
ఆ మాటె అంటే ఈ చిన్నారీ నమ్మదేంటమ్మా
నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే

ఆడించి అష్ట చెమ్మా ఓడించావమ్మా
నీ పంట పండిందే ప్రేమా
నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే
ఆ మాటె అంటే ఈ చిన్నారీ నమ్మదేంటమ్మా
నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే

ఊరంతా ముంచేస్తూ హంగామా చేస్తావేంటే గంగమ్మా
ఘోరంగా నిందిస్తూ ఈ పంతాలెందుకు చాల్లే మంగమ్మా
చూశాక నిన్ను వేశాక కన్ను వెనెక్కేలాగ తీసుకొను
ఎం చెప్పుకోను ఎటు తప్పుకోను నువ్వోద్దన్నా నేనొప్పుకోను
నువ్వేసే గవ్వలాటలొ నిలేసే గళ్ళ బాటలొ
నీ దాకా నన్ను రప్పించ్చింది నువ్వే లేవమ్మా
నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడటం అంతే

నా నేరం ఏముందే ఎం చెప్పిందో నీ తల్లో జేజెమ్మా
మందారం అయ్యింది ఆ రోషం తాకి జళ్ళో జాజమ్మా
పూవ్వంటీ రూపం నాజూగ్గా గిల్లీ కెవ్వంది గుండె నిన్న దాకా
ముళ్ళంటీ కోపం వొళ్ళంతా అల్లీ నవ్వింది నేడు ఆగలేక
మన్నిస్తే తప్పేం లేదమ్మా మరీ ఈ మారం మానమ్మా
ఈ లావాదేవీ లేవీ అంత కొత్తేం కాదమ్మా



Credits
Writer(s): Sirivennela Sitharama Shastry, Kalyani Malik
Lyrics powered by www.musixmatch.com

Link