Andhama Andhama

అందమా అందుమా
అందనంటే అందమా
చైత్రమా చేరుమా
చేరనంటే న్యాయమా
ప్రాణమున్న పైడి బొమ్మ
పారిజాత పూల కొమ్మ
పరవసాలు పంచవమ్మ
పాల సంద్రమా
అందమా అందుమా
అందనంటే అందమా
చైత్రమా చేరుమా
చేరనంటే న్యాయమా

ప్రాణమున్న పైడి బొమ్మ
పారిజాత పూల కొమ్మ
పరవసాలు పంచవమ్మ
పాల సంద్రమా
ఆడుమా పాడుమా
మౌనమే మానుకోవమ్మ
అందమా అందుమా
అందనంటే అందమా

ఆకలుండదే దాహముండదే
ఆకతాయి కోరిక కొరుక్కు తింటదే
ఆగనంటదే దాగనంటదే
ఆకు చాటు వేడుక కిర్రెక్కమంటదే
వన్నెపూల విన్నపాలు విన్నానమ్మి
చిటికనేలు ఇచ్చి ఏలుకుంటానమ్మి
రాసిపెట్టి ఉంది గనక నిన్నే నమ్మి
ఊసులన్ని పోతగుచ్చి ఇస్తా సుమ్మి
ఆలనా పాలనా చూడగా చేరనా చెంత

అందమా అందుమా
అందనంటే అందమా
చైత్రమా చేరుమా
చేరనంటే న్యాయమా

వెయ్యి చెప్పిన లక్ష చెప్పినా
లక్ష్య పెట్టవే ఎలా ఇదేమి విల విలా
తియ్య తియ్యగా నచ్చ చెప్పని
చిచ్చి కొట్టని ఇలా వయ్యారి వెన్నెల
నిలవనీదు నిదరపోదు నారాయణ
వగలమారి వయసుపోరు నా వల్లన
చిలిపి ఆశ చిటికెలోన తీర్చేయ్యన
మంత్రమేసి మంచి చేసి లాలించన
ఆదుకో నాయనా ఆర్చవా తీర్చవా చింత

అందమా అందుమా
అందనంటే అందమా
చైత్రమా చేరుమా
చేరనంటే న్యాయమా

ప్రాణమున్న పైడి బొమ్మ
పారిజాత పూల కొమ్మ
పరవసాలు పంచవమ్మ
పాల సంద్రమా
ఆడుమా పాడుమా
మౌనమే మానుకోవ



Credits
Writer(s): Raj-koti, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link