Yenno Yenno (From "Malli Malli Idi Rani Roju")

ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలికళ్ళై మెరిసెలే
మబ్బుల్లోని జాబిల్లే నా చెలి నగుమోమై విరిసెలే

గుండెలో ప్రాణంగా నీవే నిండంగా,
మండే ఎండల్లో వేసే చలి చలి.
ప్రేమ-రాగాలు, ప్రణయ-కలహాలు,
నాకు నీవే... నీవే...

వేవేల ముందు జన్మాల బంధాలన్నీ నీవేలే
ఎదలో సందళ్ళు నీ అందాలేలే
సంద్రాల నీరే ఇంకేటి బంజర్లోనూ పూచేటి పూలన్నీ నీ హొయలే...

ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలికళ్ళై మెరిసెలే
మబ్బుల్లోని జాబిల్లే నా చెలి నగుమోమై విరిసెలే

నీకోసమే ఎదనే గుడిలా ఇలా మలిచి నా మనసే,
నీ కానుకై నిలిచే తనువే...
నవరసమే నీవంట, పరవశమై జన్మంతా,
పరిచయమే పండాలంట, ప్రేమే ఇంకా ఇంకా!
మరిమరి నీ కవ్వింత, విరియగా నా వొళ్ళంతా,
కలిగెనులే ఓ పులకింత, ఎంతో వింత!
నువ్వూవిన జగమున నిలుతునా ప్రియతమా

వేవేల ముందు జన్మాల బంధాలన్నీ నీవేలే
ఎదలో సందళ్ళు నీ అందాలేలే
సంద్రాల నీరే ఇంకేటి బంజర్లోనూ పూచేటి పూలన్నీ నీ హొయలే...

ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలికళ్ళై మెరిసెలే
మబ్బుల్లోని జాబిల్లే నా చెలి నగుమోమై విరిసెలే

గుండెలో ప్రాణంగా నీవే నిండంగా,
మండే ఎండల్లో వేసే చలి చలి.
ప్రేమ-రాగాలు, ప్రణయ-కలహాలు,
నాకు నీవే... నీవే...

వేవేల ముందు జన్మాల బంధాలన్నీ నీవేలే
ఎదలో సందళ్ళు నీ అందాలేలే
సంద్రాల నీరే ఇంకేటి బంజర్లోనూ పూచేటి పూలన్నీ నీ హొయలే...

Credits
Writer(s): Sahithi, Gopi Sundar
Lyrics powered by www.musixmatch.com

Link