Nuvante Chala Istam

నువ్వంటే చాలా ఇష్టమని
ఈడు అంటున్నది
మనస్సే నీకు ఇవ్వమని
గోల పెడుతున్నది
ఆ గోల తెలిసేదెలా
అంత దూరముంటే
దూరాలు తరిగేదెలా జంట చేరకుంటే
కౌగిళ్లు చేరక ఒళ్లే సేద తీరక
తీరేది ఆగక కిర్రెక్కించు కోరిక
నువ్వంటే చాలా ఇష్టమని
ఈడు అంటున్నది
మనస్సే నీకు ఇవ్వమని
గోల పెడుతున్నది

నా వేడి నరాలలో
నయాగరా కథాకళి
సాగింది తుఫానుగా కులాస కేలి
నీ వేడి నిషాలతో
సితారగా అయి చేయి
మోగింది హుషారుగా సుఖాల కేలి
పొంగింది నిప్పుల వాగు
హుస్సూరంది పున్నమి నాగు
తెలవారేలా కల తీరేలా
చెలరేగే వేగాన
తెగేదా తగాదా ఎలా ఏం చేసినా
నువ్వంటే చాలా ఇష్టమని
ఈడు అంటున్నది
మనస్సే నీకు ఇవ్వమని
గోల పెడుతున్నది

చీరంటే చిరాకని మరీ
అలా ఉడుక్కొని
చూడొద్దు ఎరెర్రగా ఉసూరనేలా
నీ ఒంటినతుక్కొని ఉంటుందిగా
అదేం పని
నాకాస్త అసూయగా చిర్రెక్కి పోదా
ఏయ్ నీ సొమ్మేగా నా కాడుంది
నా చూపొస్తే చీపో అంది
తరుణం రాని తలవంచకుకొని
తనే తప్పుకు పోతుంది
అదేదో ఇవాలే అనేద్దాం రమ్మని

నువ్వంటే చాలా ఇష్టమని
ఈడు అంటున్నది
మనస్సే నీకు ఇవ్వమని
గోల పెడుతున్నది
ఆ గోల తెలిసేదెలా
అంత దూరముంటే
దూరాలు తరిగేదెలా జంట చేరకుంటే
కౌగిళ్లు చేరక ఒళ్లే సేద తీరక
తీరేది ఆగక కిర్రెక్కించు కోరిక



Credits
Writer(s): Sirivennela Sitarama Sastry, S.a.raj Kumar
Lyrics powered by www.musixmatch.com

Link