Janaku Jana

ఊహలలో ఊపిరిలో ఉన్నది నీవేలే
నా మనసూ నా వయసూ అన్నీ నీకేలే
నన్ను గెలిచినా సుందరివే
మనసు దోచినా మంజరివే
అణువు అణువునా నీవేలే
అంతరాత్మలో నీవేలే
కొండా కోనా ఎండా వానా అన్నీ మనవేలే

భూగోలపు అంచుల వెంటా తిరిగే వద్దాం
ఏడేడు సందారైనా దాటే వద్దాం
గగనంలో గోలలన్ని గాలించేద్దాం
మన ప్రేమల జండా ఒక్కటి నాటే వద్దాం
ఆ నింగీ ఈ నేలా మన స్వేచ్చ కేమొ ఎల్లలూ
హరి విల్లు చిరు జల్లు మన ప్రేమ కేమొ సాక్షులూ
చంద్రుడెరుగని పున్నమి రాత్రులు ప్రేమలోనె ఉన్నాయిలే

ఊహలలో ఊపిరిలో ఉన్నది నీవేలే
ఊసులలో బాసలలో ఉన్నది నీవేలే

ప్రేమస్త్రం సందిస్తేనె తిరుగే లేదూ
అణ్వస్త్రాలెన్నున్నా చెల్లా చెదురూ
లోకంలో శాస్వతమైనది ప్రేమేనంటా
ఆ ప్రేమకి కావలసినదీ మనసేనంటా
ఆ నాడు ఈ నాడు గెలిచేది ప్రేమ ఒక్కటే
ఎవరన్నా ఏమన్నా నిలిచేది ప్రేమ ఒక్కటె
కాలమెరుగని గాదలు ఎన్నో ప్రేమలోనే ఉన్నాయిలే

ఊహలలో ఊపిరిలో ఉన్నది నీవేలే
నా మనసూ నా వయసూ అన్నీ నీకేలే
నన్ను గెలిచినా సుందరివే
మనసు దోచినా మంజరివే
అణువు అణువునా నీవేలే
అంతరాత్మలో నీవేలే
కొండా కోనా ఎండా వానా అన్నీ మనవేలే



Credits
Writer(s): Bhuvana Chandra, S.a. Rajkumar
Lyrics powered by www.musixmatch.com

Link