Prema - Telugu

ప్రేమ నువ్వెక్కడ ఉన్నా ఇక్కడ రావమ్మ
వీచే గాలుల్లో ఎన్నో రంగులు తేవమ్మ
రోజూ నువు చూస్తూ ఉండే జంటలు కావమ్మ
నీకే ముద్దొచ్చేటంత చిత్రం లేవమ్మ

చరితా నీకు ఇంకో పాఠం చెబుతా రమ్మని
జతగా కలిసి దేవుని తోడు జగమే ఏలనీ
ఒక వారం రోజుల్లో ప్రేమ కథ కొత్త రాగం నేర్పించనీ
ప్రేమ జంట ఓ కంటి చూపైనా అచ్చు లేని భాషేనని

రథమై సాగు పయనం మనది విజయం తోడు రాగా

సీతాకోక చిలుకలమవుదాం గగనం ఎగిరిపోగ
పడి లేచే కెరటాల ప్రతి చినుకు తలంబ్రాలే అనిపించదా
పెదవంచుల్లోనున్న చెలి పలుకు
వేద మంత్రం వినిపించనా

ఇవి ప్రేమకు పూసిన పువ్వులు
ఇల జారిన వెన్నెల నవ్వులు
చాలిచాలని గొడుగులో తడి తడబడిపోయిన అడుగగులు

నిదురే రాక ఉదయం కొరకు వెతికాం ఇంతకాలం

హృదయం తలుపు తెరిచిన చెలిమికి మనమే సంతకాలం
గుప్పెడంత ఈ గుండె లోతుల్లో ఉప్పెనంత ప్రేమోత్సవం
గుచ్చిపోయే కాలాల పూలవనం
ఉండిపోనీ ఈ సంబరం



Credits
Writer(s): G.m. Sathish, Aatla Arjun Reddy
Lyrics powered by www.musixmatch.com

Link