Anadaala Puttina

అందాల మా ఊరి అక్కా చెల్లెల్లే
జమిలిగా పూసిన జాజిమల్లెలే

అందాల మా ఊరి అక్కా చెల్లెల్లే
(సమ్మక్క సారక్క)
జమిలిగా పూసిన జాజిమల్లెలే
(సమ్మక్క సారక్క)
మట్టితల్లి పొత్తిళ్ళల్లో ముత్యాల గుమ్మలే
నిట్టాడి గుడిసెలో పుత్తాడి సెమ్మెలే

అందాల మా ఊరి అక్కా చెల్లెల్లే
(సమ్మక్క సారక్క)
జమిలిగా పూసిన జాజిమల్లెలే
(సమ్మక్క సారక్క)

వేపచెట్ల గాలులె
వీపులే నిమురంగా
జీడి కట్ల రెమ్మలే
దిష్ఠినే తీయంగ
ఊడలా మర్రిచెట్టూ ఉయ్యాలాలూపంగా
ఊడలా మర్రిచెట్టు ఉయ్యాలలూపంగ
ఒళ్ళు రాసి నీళ్ళుపోసె ఏరు కన్నతల్లి తీరు

అందాలా
అందాలా
అందాల మా ఊరి అక్కా చెల్లెల్లే
(సమ్మక్క సారక్క)
జమిలిగా పూసిన జాజిమల్లెలే
(సమ్మక్క సారక్క)

పైరుకోసిన వరిమల్లె
పరిగె ఏరుకొమ్మనే
వేరుశనగ తోటల్లే
శనగ పలుకులిచ్చెనే
మొక్కజొన్న ఒళ్లు ఉన్నా పాలకంకూలిస్తా ఉంటె
మొక్కజొన్న ఒళ్ళు ఉన్న పాలకంకులిస్తు ఉంటె
కొండగట్లు పంటచెట్లు కొంగు నింపి పంపుతుంటే

అందాలా
అందాలా
అందాల మా ఊరి అక్కా చెల్లెల్లే
(సమ్మక్క సారక్క)
జమిలిగా పూసిన జాజిమల్లెల్లే
(సమ్మక్క సారక్క)

రెల్లుపూలు నవ్వ నేర్పే
హంసలేమో నడవ నేర్పే
మైన పిట్ట మాట నేర్పే
కోకిలమ్మ పాట నేర్పే
మొగులు తల్లీ నీడలోనా నెమలిపిల్లా ఆడానేర్పే
మొగులు తల్లి నీడలోన నెమలిపిల్ల ఆడనేర్పే
అల్లిబిల్లి సోపతుల మల్లెతీగ నేర్పినాది

అందాలా
అందాలా
అందాల మా ఊరి అక్కా చెల్లెల్లే
(సమ్మక్క సారక్క)
జమిలిగా పూసిన జాజిమల్లెలే
(సమ్మక్క సారక్క)

బండి లోడు చూడకుండా
గూడెమంతా కాపుకాసె
కరినపోడు చూడకుండా
గల్లీ గల్లీ కప్పు వేసే
దొరగాడు చూడకుండా ఊరువాడా గొడుగులేసే
దొరగాడు చూడకుండా ఊరువాడా గొడుగులేసే
గుడిసె గుడిసె గడపలన్ని కడుపులోన దాచుకుంటే

అందాలా
అందాలా
అందాల మా ఊరి అక్కా చెల్లెల్లే
(సమ్మక్క సారక్క)
జమిలిగా పూసిన జాజిమల్లెలే
(సమ్మక్క సారక్క)



Credits
Writer(s): Vandemataram Srinivas, Suddhala Ashok Teja
Lyrics powered by www.musixmatch.com

Link