Oorelipota Mama

ఊరెళ్ళిపోతా మామ ఉరెళ్ళిపోతా మామ
ఎర్రబస్సెక్కి మళ్లీ తిరిగెళ్ళిపోతా మామ
ఊరెళ్ళిపోతా మామ ఉరెళ్ళిపోతా మామ
ఎర్రబస్సెక్కి మళ్లీ తిరిగెళ్ళిపోతా మామ

ఏ ఊరెళ్తావ్ రామ ఏముందనెళ్తావ్ రామ
ఊరన్న పేరే తప్ప తీరంతా మారే రామ
ఏ ఊరెళ్తావ్ రామ ఏముందనెళ్తావ్ రామ
ఊరన్న పేరే తప్ప తీరంతా మారే రామ

నల్లమల అడవుల్లోన పులిచింత చెట్లకింద
మల్లెలు బూసేటి సల్లని పల్లె ఒకటుంది
మనసున్న పల్లెజనం మోసం తెలియనితనం
అడివి ఆ పల్లె అందం పువ్వుతేనెల చందం

నల్లమల అడవుల్లోన పులిచింత చెట్లకింద
పుత్తడి గనుల కోసం చిత్తడి బావులు దవ్వే
పుత్తడి మెరుపుల్లోన మల్లెలు మాడిపోయే
మనసున్న పల్లెజనం వలసల్లో సెదిరిపోయే

ఏ ఊరెళ్తావ్ రామ ఏముందనెళ్తావ్ రామ
ఊరన్న పేరే తప్ప తీరంతా మారే రామ
ఏ ఊరెళ్తావ్ రామ ఏముందనెళ్తావ్ రామ
ఊరన్న పేరే తప్ప తీరంతా మారే రామ

గోదారి లంకల్లోన అరిటాకు నీడల్లోన
ఇసుక తిన్నెలు మీద వెండివెన్నెల్లు కురువ
గంగమ్మ గుండెల్లోన వెచ్చంగా దాచుకున్న
సిరులెన్నో పొంగిపొరలే పచ్చని పల్లె ఒకటుంది

గోదావరి గుండెల్లోన అరిటాకు నీడల్లోన
ఇసుకంతా తరలిపాయే యెన్నెల్లు రాలిపాయే
ఎగువ గోదారిపైన ఆనకట్టలు వెలిసే
ఆపైన పల్లెలన్నీ నిలువున మునిగిపోయే

ఏ ఊరెళ్తావ్ రామ ఏముందనెళ్తావ్ రామ
ఊరన్న పేరే తప్ప తీరంతా మారే రామ



Credits
Writer(s): Ram Miriyala
Lyrics powered by www.musixmatch.com

Link