O Chinna Navve Chaalu

ఓ చిన్న నవ్వే చాలు అలా పలకరిద్దాం
ఓ చిన్న మాటే చాలు బంధాలల్లుకుందాం
ఏ ఊరు మీదే పేరు అడిగి తెలుసుకుందాం
ఎవరైనా మన వారేగా వరస కలుపుకుకుందాం
ఒక నింగికి ఒక నేలకి ఒకే ఊపిరి చిరుగాలికి
అనుబంధమై మనమందరం ఈ రోజు కలిసుందాం
ఆ సంగతే సరికొత్తగా
ఈనాడిలా మరికొంతగా
మన మనసుకు గుర్తుండగా మళ్ళీ అనుకుందాం
దం దం అందమైన బంధం అల్లుకున్న బతుకే నిత్య నందనం
చుట్టూ ఇంతమంది చుట్టాలున్న వేళ ఆహా ఎంత సంబరం

కన్నీళ్ళకైనా సంతోషాలకైనా
ఎహే కావాలి తోడు సదా ఎవరికైనా
పుష్పక విమానమే మరి ప్రతి ఒక్కరి మసంటే
హే అనుబంధాలెన్నొచ్చినా అది ఇరుకైపోదంతే
మనసైన మనవారంతా
మన పక్కన కొలువై ఉంటే
అరె కోరేందుకింక మరేది లేదే
ప్రయాణమంతా పదనిసలే
దం దం అందమైన బంధం అల్లుకున్న బతుకే నిత్య నందనం
చుట్టూ ఇంతమంది చుట్టాలున్న వేళ ఆహా ఎంత సంబరం

మారింది కాలం
వేగం దీని రాగం
దగ్గరలో దూరం
ఇదెంతో ప్రమాదం
హే పనిమాలా ఓ కారణం ఏదోటి వెతికేద్దాం
పదిమంది కలిసేటట్టుగా రోజొక పండగ పుట్టిద్దాం
అపుడెపుడో తెలిసిన వారు
ఇపుడిపుడే కలిసిన వారు
అసలెపుడూ విడువక జత నడిచేలా
రవ్వంత బతుకున రంగులు పోద్దాం
దం దం అందమైన బంధం అల్లుకున్న బతుకే నిత్య నందనం
చుట్టూ ఇంతమంది చుట్టాలున్న వేళ ఆహా ఎంత సంబరం
దం దం అందమైన బంధం అల్లుకున్న బతుకే నిత్య నందనం
చుట్టూ ఇంతమంది చుట్టాలున్న వేళ ఆహా ఎంత సంబరం



Credits
Writer(s): Gopi Sundar, Ramajogayya Sastry
Lyrics powered by www.musixmatch.com

Link