Norara Navveddam

రాళ్లతో ముళ్లతో నేస్తమే నాదిరా
నొక్కినా తొక్కినా నొప్పిగాలేదురా
బరువునే పరువుగా మోసేటీ ఈ బతుకు నేర్పింది ఒక్కటే
ఊపిరుండే వరకూ... ఉసూరుమనక
ఎప్పడూ నవ్వుతూ బతకాలిరా
ఎలా బతకాలిరా
ఎప్పడూ నవ్వుతూ బతకాలిరా

నోరార నవ్వేద్దాం ఖరీదులేదు చిన్న నవ్వుకీ
కన్నార నిదరోదాం ఖర్చేమికాదు కంటిపాపకీ

అరె నోరార నవ్వేద్దాం ఖరీదులేదు చిన్న నవ్వుకీ
కన్నార నిదరోదాం ఖర్చేమికాదు కంటిపాపకీ
నా సంగీతం గాలిపాట
నా సావాసం పూలతోట
నాకే సొంతం లోకమంత
నాకే మాత్రం లేెదుచింత

నోరార నవ్వేద్దాం ఖరీదులేదు చిన్న నవ్వుకీ
కన్నార నిదరోదాం ఖర్చేమికాదు కంటిపాపకీ

వీళ్ళే బంధువులు అంటూ లేరు జనమంతా నాకు చుట్టాలె
ఇల్లూవాకిలంటు లేనేలేదు జగమంతా నాకు సొంతిల్లే
ఆకలి తీరితె చాలునంది నా కడుపు
అందుకే మరిలేదుగా నాకు ఏ తలుపూ

నోరార నవ్వేద్దాం ఖరీదులేదు చిన్న నవ్వుకీ
కన్నార నిదరోదాం ఖర్చేమికాదు కంటిపాపకీ

(ఏలేల్లే హే ఏలేల్లే
ఏలేల్లే హే ఏలేల్లే
ఏలేల్లే ఏలేల్లే
ఏలేల్లే ఏలేల్లే
ఏలేల్లే ఏలేల్లే ఏలేల్లే ఏలేల్లే ఏలేల్లేఏలే లే)

సంతోషాన్నిమించి ఆస్తీపాస్తీ ఇంక వేరే ఎందుకనుకున్నా
అంతేనేర్చుకుని అంతేచాలు అని అదే పంచిపెడుతున్నా
కోటలో రాజులా ఉండలేను నేనసలు
తోటలో ఒక పువ్వులా ఉండనీ చాలు

అరె నోరార నవ్వేద్దాం ఖరీదులేదు చిన్న నవ్వుకీ
హే కన్నార నిదరోదాం ఖర్చేమికాదు కంటిపాపకీ
నా సంగీతం గాలిపాట
నా సావాసం పూలతోట
నాకే సొంతం లోకమంత
నాకే మాత్రం లెదుచింత

నోరార నవ్వేద్దాం ఖరీదులేదు చిన్న నవ్వుకీ
కన్నార నిదరోదాం ఖర్చేమికాదు కంటిపాపకీ



Credits
Writer(s): Devi Sri Prasad, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link