Chinnataname (From "Prati Roju Pandaage")

చిన్నతనమే చేర రమ్మంటే
ప్రాణం నిన్న వైపే దారితీస్తోందే
అడుగులైతే ఎదరకైనా
నడక మాత్రం వెనకకే
గడిచిపోయిన జ్ఞాపకాలతో గతము ఎదురవుతున్నదే
చెరిగిపోనే లేదే
మరుపురానే రాదే
చివరి మలుపున నిలచి పిలిచిన
స్మృతుల చిటికిన వేలు వదలని చెలిమిగా
ఊహలే ఉప్పొంగుతున్నవిలా
ముగియని కథలతో మది మేలుకున్నదిలా
(సరి సరి సరినిప సరి సరిగరి సపస)
(సరి సరి సరినిప సరి సరిమప రిసపస)

తాతగా తలపండినా తండ్రి తనమే ఎందున
ఒడిని దిగి కొడుకెదిగినా నాన్న మురిపెము తీరునా
వయసు వాలినా సందె వాలునా
చేతికందిన ప్రియవరం
మనవడై తన పసితనమ్మును వెంట తెచ్చిన సంబరం
కొత్త ఊపిరి కాగా
మనసు ఊయలలూగ
తరతరమ్ముల పాటు ఇంక నీ వంశధారగా మారి
కడలిని కలియని జీవనదిగా పారుతుంది కదా
కంచికి చేరు కథగా ముగిసిపోదు కదా
(సరి సరి సరినిప సరి సరిగరి సపస)
(సరి సరి సరినిప సరి సరిమప రిసపస)



Credits
Writer(s): Sirivennela Seetha Rama Shastry, Thaman Ss
Lyrics powered by www.musixmatch.com

Link