Komma Veedi

కొమ్మ వీడి గువే వెళ్తోందిలె
పూవు కంట నీరే కురిసే
అమ్మ ఒడి వీడే పసిపాపలా
వెక్కి-వెక్కి మనసే తడిసే

చదివే బడికే వేసవి సెలవులా
తిరిగి గుడికే రావాలి నువ్విలా
ఒక్కపూట నిజమయి మన కలలు ఇలా
ముందరున్న కలం గడిచేది ఎలా
బ్రతుకే గతమయి ఈ చోటాగేలా

కన్ను వీడి చూపే వెళుతోందిలే
కంట నీరు తుడిచేదేవరే

చిరునవ్వులే ఇక నన్నే విడిచెనులే
నిన్ను విడువని, ఏ నన్నో వెతికేనులే

చిగురాశలే ఇక శ్వాసై నిలిపేనులే
మన ఊసులు జతలేక ఎడబాసెలే

నా నుంచి నిన్నే విడదీసేటి విధినైనా
వేధించి ఓడించి ఇంకో జన్మే వరమే-వరమే

మనం మనం చెరో సగం చెరో దిశాల్లే మరీనా
ఒకే స్వరం ఏకాక్షరం చెరో పాదంలో చేరినా

నువున్న వైపు, తప్ప చూపు తప్పు దిశన చూపునా
అడుగులన్నీ మనము కల్సి ఉన్న దారి విడిచేనా
మరి మరి నిన్నడగమంటూ జ్ఞాపకాల ఉప్పెన
చిరాయువేదో ఊపిరై నీకోసమేదురు చూపు
కవితలే రాసే నీకై మల్లి రా



Credits
Writer(s): Govind Vasantha, Sri Mani
Lyrics powered by www.musixmatch.com

Link