Zindagi Ani Jill (From "Supplementary")

జిందగీ అనే జిల్ జిల్ గుండెలో చప్పుడై సాగుతుందిరా
అందమైన నీ నవ్వులోని వెలుగులా వేడుకై పొంగుతుందిరా
నువ్వని నేనని కురిసే మాటల్లో
బంధమే అల్లుతూ రాదా
నిన్నని మొన్నని వెతికే చూపుల్లో
నేటిలా తేటగా నువ్వై కనబడదా
ఇదంతా చప్పుడైనా చేయకుండా ఊగిపోయే హాయి పాటలా
నేలంతా కొత్త భూమి పుట్టుకొచ్చి కోట్ల రంగులెత్తుతుందిరా
ఇవాళ కళ్ళతోనే కళ్ళకేదో కొత్త భాష నేర్పుతుందిరా
ఇష్టంగా మనసు చేతి తోడై నిన్ను పట్టు పట్టి లాగుతుందిరా
జిందగీ అనే జిల్ జిల్ గుండెలో చప్పుడై సాగుతుందిరా

చదివే నీ పాఠంలో అర్థం చూపించే అద్దంగా మారదా
ఎదిగే నీ కళ్ళలల్లో రంగులు పూయించే చైత్రంలా విరియదా
పరిచయాల పలకరింతలోనే గుండెనంతా పరిమళాల జల్లై
పరుచుకున్న చెలిమి దారిలోనే పంచుతూ స్నేహాన్నే
అందమైన బంధమల్లుతూనే అంతులేని ఊహలయ్యి తానే
ఆపలేని ఆశ జల్లులే తడిపి నిన్ను హాయ్ అంటూ ఆరేసే
జిందగీ అనే జిల్ జిల్ గుండెలో చప్పుడై సాగుతుందిరా

పొద్దున్న లేపే పిలుపై, పొద్దంతా తిరిగే నీడై, పొద్దెళ్ళిపోతే మిగిలే ఒంటరై
హద్దుల్ని దాటే తెగువై, వద్దంటూ మీటే ప్రేమై, నిద్దట్లో కలిసే కలల కాంతులై
వెన్ను నీకే చూపుతూ
కొత్త రాగం నేర్పుతూ మలుపు మలుపు మనస్సు ఆపేసి
జిందగీ అనే జిల్ జిల్ గుండెలో చప్పుడై సాగుతుందిరా
అందమైన నీ నవ్వులోని వెలుగులా వేడుకై పొంగుతుందిరా
ఇవాళ కళ్ళతోనే కళ్ళకేదో కొత్త భాష నేర్పుతుందిరా
ఇష్టంగా మనసు చేతి తోడై నిన్ను పట్టు పట్టి లాగుతుందిరా
ఇదంతా చప్పుడైనా చేయకుండా ఊగిపోయే హాయి పాటలా
ఇష్టంగా మనసు చేతి తోడై నిన్ను పట్టు పట్టి లాగుతుందిరా

Credits
Writer(s): Varikuppala Yaadagiri
Lyrics powered by www.musixmatch.com

Link