Adigo Prema

అదిగో ప్రేమ జగం పిలుస్తోంది ఇద్దరిని
యదనే పల్లవి చేసి పాడమని
సఖియా ప్రేమ యుగం చెరుపుతుంది హద్దులని
యదలో నీ రూపం ఏళ్ల కాలం చూడమని
నీ నీడ నేనే ప్రియతమా నా తోడు కావా ప్రాణమా
హృదయం ఉదయం నీలోనే ఉన్నది
అదిగో ప్రేమ జగం పిలుస్తోంది ఇద్దరిని
యదనే పల్లవి చేసి పాడమని

నిను నే చూడకనే హృదయము నిలువదులే
మనసే నీకు కానుక మనువే ఆడుకో ఇక
నువ్వు ఎడారిలో చినుకై నా యదలోనే పడగా
నా కనుల కలల పూలు పూచేనె
తొడుగ నీవుంటే వెన్నెల ఎందుకని
కొసరిన తొలి వయసే గుండెలో ఉండమని
నా స్నేహం ఇది నేస్తమా
స్నేహం దాహం ఈనాడే తీరనీ
అదిగో ప్రేమ జగం పిలుస్తోంది ఇద్దరిని
యదనే పల్లవి చేసి పాడమని

నా యద మధువనిలో నర్తించు ఊర్వశివై
నువ్వే లోకమంటినే నీకై కాచుకుంటినే
నీ రూపమే నాకు దైవం నీ చూపులే నాకు జీవం
నిను దాచుకన్న కన్నె మనసిది
పరువంలో మోహం తొలి ఈడు మదన తాపం
ఒకలిన కోరికంట నువ్వై రేత విరహం
కొంటె దాహం ఇక తీర్చుమా
అందం చందం అందుకో నువ్విక
అదిగో ప్రేమ జగం పిలుస్తోంది ఇద్దరిని
యదనే పల్లవి చేసి పాడమని
సఖియా ప్రేమ యుగం చెరుపుతుంది హద్దులని
యదలో నీ రూపే ఏళ్ల కాలం చూడమని
నీ నీడ నేనే ప్రియతమా నా తోడు కావా ప్రాణమా
హృదయం ఉదయం నీలోనే ఉన్నది



Credits
Writer(s): Srikanth Deva, Vennelakanti
Lyrics powered by www.musixmatch.com

Link