Nee Sontham

నర నరము పూల రధమై రగిలే ఇటు రారా
అణువణువు నీది అనన ఇలా
రసికతలో నీకు ఎవరూ జగమున సాటి రారురా
అని తెలిపే మాట నిలుపు హలా, హలా, హలా

ఏదో చెయ్యి నాతోటి కలిసి పరువం నీదెరా
ఎదభారం మోయానాలోన కురిసే అలుపేరాదురా
మొహం నీకు మౌనాలు తెలిపే గారం చూడరా
ఒక మేఘంలోన లోకాలు కదిపే హాయే చూపరా

నీ సొంతం నేనిక ఒడిలో అందం నీదిగా
భరిలో అంతం చూడిక తొలిగా పలికా
ఓ గాయం చేయరా జతలో సర్వం దోచరా
మరల తాపం లేపరా వడిగా తడిగా

నీ కోసం నాలోన ప్రాయం దాచా ఏనాడో
ఆ సాగర కెరటంల పడిపో నా పైన (పైన, పైన)
ఈ గాజుల గోలేదో మళ్ళీ మళ్ళీ మోగాలి
ఆ కాలి మువ్వేమో ఊగి ఊగి అలిసేపోని (పోని, పోని, పోని)

తొలి సారి ఒక దాహం తీరెనే తియ్యగా
మలి సారి ఒక భావం రేగెనే హాయిగా
తనువంతా ఒక వైరం కోరెనే మోజుగా
వయసంతా అర విరిసే తడిసే సేదంలో

నీ వేడి కౌగిలి అడిగా ఇష్టం తీరక
నిమిషం విడిచి ఉండక దరికే జరిగా
నీ వెనకే నేనిలా నడిచా నీలో భాగమై
సగమైపోయి నేడిల పనిలో పనిగా పనిగా (నిగా, నిగా, నిగా, నిగా)



Credits
Writer(s): Krishna Madineni, Sricharan Pakala
Lyrics powered by www.musixmatch.com

Link