Vijayam

ఏ సమరం మనది ఐతే విజయం మనదే కదా
కలలే కడలి ఒడిలో అలలై ఎగిసే కదా
ఈ విడి విడి అడుగులు ఒకటై పరుగులు పెడితే
జగమంతా మనవెంటే జయమంటూ సాగదా
ప్రతి మది తన గది విడిచి బయటికి రాగా
ఈ హృదయం ఇక విశాలమే కాదా రారా
హే మొదటి అడుగు ఇపుడే పడింది సోదరా
సకల జగతి కోసం సై అంటూ సాగదా
కలలుగన్న కాలం ముందుంది చూడరా
గెలుపు పిలుపు వింటూ చిందేసేయ్ లేరా

ఏ కూసింతా నేలలేని వాడు కూలోడయ్యెరా
సన్నకారు రైతు కూడా కన్నీరు ఆయెరా
కష్ట జీవి కడుపుకింత కూడైనా లేదురా
చెమట చుక్క విలువలేని సరుకైనాదిరా
ఆడోళ్ళపై ఆరళ్ళు ఏందిరా
నీ విద్యకే ఉద్యోగమేదిరా
హే మొదటి అడుగు ఇపుడే పడింది సోదరా
సకల జగతి కోసం సై అంటూ సాగదా
కలలుగన్న కాలం ముందుంది చూడరా
గెలుపు పిలుపు వింటూ చిందేసేయ్ లేరా

అడవి తల్లి బిడ్డలంత అల్లాడి పోయెరా
పల్లెతల్లి తల్లడిల్లి ఘొల్లుమన్నాదిరా
నగర జీవి నడ్డి విరిగి నగుబాటే అయ్యెరా
అన్నపూర్ణ భరతమాత ఆక్రోశించెరా
ఈ దేశమే ఆదేశమిచ్చెరా
ఓ మార్పుకై సంకల్పమిచ్చెరా
అడుగు అడుగు కలిపి చిందేసి ఆడరా
సకల జగతి కోసం సై అంటూ సాగరా
కలలుగన్న కాలం ముందుంది చూడరా
గెలుపు పిలుపు వింటూ చిందేసేయ్ లేరా



Credits
Writer(s): Chaitanya Prasad, Suresh Bobbili
Lyrics powered by www.musixmatch.com

Link