Nuvvu Nenu

నువ్వు నేను ఒక్కటైన ఈ క్షణం
గుండెలోన అంతులేని సంబరం
నువ్వు నేను ఒక్కటైన ఈ క్షణం
గుండెలోన అంతులేని సంబరం
నిన్ను నన్ను కూడుతున్న ఈ వరం
తేలి తేలి అందుతోంది అంబరం
నువ్వు నేను, నేను నువ్వు ఇంతకన్నా ఏదీ లేదు
ఆశ నువ్వు, శ్వాస నేను అంది నాలో నీలో నవ్వు
ఎన్నెన్నో జన్మల పుణ్యం నీ ప్రేమని
గుండెల్లో హాయి పాట అందుకున్నది
ఆకాశం అంచున, మేఘాల మధ్యన
ఉయ్యాలే ఊగుతూ పాప అయినది
నువ్వు నేను ఒక్కటైన ఈ క్షణం
గుండెలోన అంతులేని సంబరం
నిన్ను నన్ను కూడుతున్న ఈ వరం
తేలి తేలి అందుతోంది అంబరం

ఇన్నాళ్ళుగా ఉన్న దూరాలన్నీ ఇంక దూరం అయి
ఈనాడు ఈ ప్రేమ దృశ్యాలు కళ్ళారా చూస్తున్నాయి
పుట్టాక రెండర్థ భాగాలుగా ఉన్న ఈ జన్మని
ఓ పూర్తి రూపంగా మారేటి అందాన్ని చూస్తున్నాయి
నా నింగిలో నీ వెన్నెల వేవేల వర్ణాలది
నీ నవ్వులో నీ చూపులో పొంగేస్తూ అంటున్నది
ఎన్నెన్నో జన్మల పుణ్యం నీ ప్రేమని
గుండెల్లో హాయి పాట అందుకున్నది
నువ్వు నేను ఒక్కటైన ఈ క్షణం
గుండెలోన అంతులేని సంబరం
నిన్ను నన్ను కూడుతున్న ఈ వరం
తేలి తేలి అందుతోంది అంబరం

నీలోన నాలోన దాగున్న భావాల మేఘాలన్నీ
ఆనంద రాగాల భాష్పాలుగా నేడు వర్షించాయి
నీ చుట్టూ నా చుట్టూ ఉంటున్న తాపాల దీపాలన్నీ
నీ కళ్ళ నా కళ్ళ వాకిళ్ళో చేశాయి దీపావళి
ప్రాణాలకే ప్రాణాలుగా మారేటి ఈ సంగమం
ఈ లోకమే ఓ శ్లోకమై పొంగేటి ప్రేమోత్సవం
ఎన్నెన్నో జన్మల పుణ్యం నీ ప్రేమని
గుండెల్లో హాయి పాట అందుకున్నది
నువ్వు నేను ఒక్కటైన ఈ క్షణం
గుండెలోన అంతులేని సంబరం
నిన్ను నన్ను కూడుతున్న ఈ వరం
తేలి తేలి అందుతోంది అంబరం



Credits
Writer(s): Varikuppala Yaadagiri
Lyrics powered by www.musixmatch.com

Link