Jingu Jingu Cheera (From "Lorry Driver")

జింగ్ జింగ్ చీర
కోణంగి కొంగు జార
నువ్వు తొంగి తొంగి చూడ కంగారుగుందిరో

కొంగు దొంగ రార
ఈ గంగ పొంగు లార
బంగారు బెంగ తీర కాపడమందిరో
చెంగుమనె చెంగునిలా చేపట్టరో
రంగులలో సంగతులే రాబట్టరో
రంగేళి రంగాలు చూపెట్టరో
రంగు రంగు జాణ
నా నంగనాచి మైన
నీ హంగు దోచుకొన నా రంగ నాయకి

అరె సంబరంగా రాన సంపెంగ సొంపుకూన
కంగారు హాయి తేనా చంగావి తాయకి
పడుచు ఎదే పొడుపు కథై కవ్వించెరో
తొడిమ నడుం తడిమి మరీ నవ్వించరో
చింగారి సిగారి చిక్కాలిరోయ్
జింగు జింగు చీర
కోణంగి కొంగు జార
నువ్వు వంగి వంగి చూడ కంగారుగుందిరో

గళ్ళ కోక చుట్టూ నీ కళ్ళు అల్లుకుంటు
గుల్ల గుల్లచేసే ఈ అల్లరేందిరో
చిత్త జల్లే పడి చిత్తు కాదా మడి
పిల్ల బండారం దండోరా అయిందిరో
బుల్లి రెకులల్లే కిల్లాడి సోకులన్నీ
వలిచి వలిచి కళ్ళు ఘాటేక్కుతున్నవే
ఉడుకు చల్లార్చవా, ముడుపు చెలించవా
కన్నె కారంతో మమకారం జోడించవా
ఊ కొట్టన జతై జో కొట్టనా
ఈ పట్టుతో మతే పోగొట్టనా
ఏ గుట్టు లేనట్టు జై కొట్టనా
రంగు రంగు జాణ
నా నంగనాచి మైన
నీ హంగు దోచుకొన నా రంగ నాయకి
జింగ్ జింగ్ చీర
కోణంగి కొంగు జార
నువ్వు వంగి వంగి చూడ కంగారుగుందిరో

చిక్కు చిక్కు పిల్ల నీ సిగ్గు సంతకెల్ల
నా ముద్దు అగ్గి పుల్ల ముట్టించి చూడనా
చురుకు పుడుతుందమ్మి ఉలికి పడుతుందమ్మి
సరుకు సరదాగా చెలరేగి ఊరేగగా
హేయ్ పక్క పక్కకొచ్చి నా పైట గాలి పీల్చి
నువ్వు తిక్క పెంచుకుంటే నా తప్పు లేదయ్యో
సత్తువంతా చెల్లే మత్తుమందే జల్లి
సోకు వాకిట్లో స్పృహ పోతే గొడవెనయ్యో
ఓయ్ ... మైకాలలో ఇదేంమాలోకమో
అంతే మరీ అదే చెలి గారడీ
జన్మంతా ఈ మత్తే ఉంటే సరి
జింగ్ జింగ్ చీర
కోణంగి కొంగు జార
నువ్వు వంగి వంగి చూడ కంగారుగుందిరో
అరె సంబరంగా రాన సంపెంగ సొంపుకూన
కంగారు హాయి తేనా చంగావి తాయకి
చెంగుమనె చెంగునిలా చేపట్టరో
హోయ్ తొడిమ నడుం తడిమి మరీ నవ్వించరో
రంగేళి రంగాలు చూపెట్టరో
రంగు రంగు జాణ
నా నంగనాచి మైన
నీ హంగు దోచుకొన నా రంగ నాయకి
జింగ్ జింగ్ చీర
కోణంగి కొంగు జార
నువ్వు వంగి వంగి చూడ కంగారుగుందిరో



Credits
Writer(s): Sirivennala Seetharama Shastry, Chakravarthy
Lyrics powered by www.musixmatch.com

Link