Iruvuru Bhamala Kogililo (From "Naari Naari Naduma Murari")

ద్వాపరమంతా సవతుల సంత జ్ఞాపకముందా గోపాల
కలియుగమందు ఇద్దరి ముందూ శిలవయ్యావే స్త్రీలోల
కాపురాన ఆపదలను ఈదిన శౌరీ
ఏది నాకూ చూపవా ఒక దారి
నారి నారి నడుమ మురారి
నారి నారి నడుమ మురారి

ఇరువురు భామల కౌగిలిలో స్వామి, ఇరుకున పడి నీవు నలిగితివా
ఇరువురు భామల కౌగిలిలో స్వామి, ఇరుకున పడి నీవు నలిగితివా
వలపుల వానల జల్లులలో స్వామి, తల మునకలుగా తడిసితివా
చిరుబురులాడేటి శ్రీదేవీ, నీ శిరసును వంచిన కథ కన్నా
రుసరుసలాడేటి భూదేవీ, నీ పరువును తీసిన కథ విన్నా
గోవిందా... గోవిందా... గోవిందా
సాగిందా జోడు మధ్యల సంగీతం
బాగుందా భామలిద్దరి భాగోతం

ఇంటిలోన పోరంటే ఇంతింత కాదయా, అన్నాడు ఆ యోగి వేమన
నా తరమా భవసాగరమీదనూ, అన్నాడు కంచెర్ల గోపన్న
పరమేశా గంగ విడుము పార్వతి చాలున్
ఆ మాటలు విని ముంచకు స్వామి గంగన్
ఇంతులిద్దరైనప్పుడు ఇంతే గతిలే
సవతుల సంగ్రామంలో పతులది వెనకడుగే
ఇంతులిద్దరైనప్పుడు ఇంతే గతిలే
సవతుల సంగ్రామంలో పతులది వెనకడుగే

ఇరువురు భామల కౌగిలిలో స్వామి, ఇరుకున పడి నీవు నలిగితివా

భామ కాలు తాకిందా కృష్ణుడే గోవిందా, అన్నాడు ఆ నంది తిమ్మన
ఒక మాట, ఒక బాణము, ఒక సీత నాదని, అన్నాడు సాకేత రామన్న
ఎదునాథా భామ విడుము రుక్మిణి చాలున్
రఘునాథా సీతనుగొని విడు శూర్పణఖన్
రాసలీలలాడాలని నాకు లేదులే
భయభక్తులు ఉన్న భామ ఒకతే చాలులే
రాసలీలలాడాలని నాకు లేదులే
భయభక్తులు ఉన్న భామ ఒకతే చాలులే
ఇరువురు భామల కౌగిలిలో స్వామి, ఇరుకున పడి నీవు నలిగితివా
వలపుల వానల జల్లులలో స్వామి, తల మునకలుగా తడిసితివా
గోవిందా... గోవిందా... గోవిందా



Credits
Writer(s): K. V. Mahadevan, Acharya Athreya
Lyrics powered by www.musixmatch.com

Link