Aanandam - Telugu

ఆనందం
(ఆనందం)

ఆరాటం
(ఆరాటం)

ఆనందం అంటే అర్ధం చూపించేటి ఓ అద్భుతం
ఆరాటం అంచుల్లోనే నిత్యం సాగే ఈ సంబరం
చిగురై ఈ పుడమి కడుపున
మొదలైయేటి ఆ మధనమే మధురమై
ఉదయం కోసం ఎదురే చూసే
నిమిషాలే నిజమైన వేడుక కాదా
ఫలితం మరిచి పరుగే తీసే
పయనం ఇక ప్రతి పూట ఒక కానుక అయిపోదా

నీరు ఆవిరిగా ఎగిసినది
తపన పెరిగి అది కడలినొదిలినది
కారు మబ్బులుగా మెరిసినది
అణువు అణువు ఒక మధువుగా మారి
తానే వానై
అడుగు అడుగు కలిపి కదిలిపోయే కడలింటి దారే
మలుపేదైనా గెలుపే చూసే
అడుగుల్లో అసలైన ఆ ఆనందం
కదిలే నదిలో ఎగిసే అలలా
ఎదలోపల క్షణం ఆగని సంగీతం కాదా

ఇంద్రధనస్సులో వర్ణములే
పుడమి ఒడిలో పడి చిగురు తోడిగినవి
శరదృతువులో సరిగమలే
తొడిమె తడిమే తొలి పిలుపుగా మారి
దాహం
తీరే
విరుల సిరులు విరిసి మురిసిపోయే సరికొత్త మాయే
భువికే మౌనం
ఉరికే ప్రాణం
తనకోసం దిగి వస్తే ఆ ఆకాశం
కరిగే దూరం తెరిచే ద్వారం
జగమంతట పులికింతలు పూసే వాసంతం

ఆనందం
అంటే అర్ధం చూపించేటి ఓ అద్భుతం
ఆరాటం
అంచుల్లోనే నిత్యం సాగే ఈ సంబరం
చిగురై ఈ పుడమి కడుపున
మొదలైయేటి ఆ మధనమే మధురమై
ఉదయం కోసం ఎదురే చూసే
నిమిషాలే నిజమైన వేడుక కాదా
ఫలితం మరిచి పరుగే తీసే
పయనం ఇక ప్రతి పూట ఒక కానుక అయిపోదా



Credits
Writer(s): Bijibal, Rehman
Lyrics powered by www.musixmatch.com

Link