Jalga Losamu (Version 1)

జల్సా లోకము పైసా మైకము
అంతా మోసము ఇది నా దేశము
ఏదీ ఏదీ మన స్వాతంత్రం
విప్లవాగ్ని కాగడాలు చేత పట్టి
సాగకుంటే లేదు లేదు స్వారాజ్యం
జల్సా లోకము పైసా మైకము
అంతా మోసము ఇది నా దేశము

రేటు పెట్టి seat-u
కొన్న విద్యార్ది
నోటు పెట్టి vote-u
కొన్న MLA
పేదవాళ్ళకి ఆశేలేని ఆసుపత్రి
ఇదిరా దేశం పురోగతి
దేశమే మట్టని మనుషులే కాదని
పిచ్చి రాయవయ్య పాట గురజాడ
తెచ్చుకోర బుద్ది కాస్తా తెలుగోడా
చేతి కర్ర దెబ్బ వేసి
జాతినింక దిద్దవయ్యా
ఇప్పుడైనా బాపూజీ
జల్సా లోకము పైసా మైకము
అంతా మోసము ఇది నా దేశము

అర్ధ రాత్రి ఆడదాని మానభంగం
చేతకాని జాతికింక శుభ భంగం
ఉన్నవాడు తప్పుచేసి చస్తుంటే
లేనివాడు తిండిలేక పస్తుంటే
ఎందుకీ రాజ్యము
ఎవరికో భోగ్యము
మేము పట్టుమన్నగొప్ప degreeలు
రోజు రోజు బూజుపట్టి పోతుంటే
డబ్బు కాదు డుబ్బు కాదు
యుక్తి కాదు భక్తి కాదు
Happy గున్నవాడే మనిషి

జల్సా లోకము పైసా మైకము
అంతా మోసము ఇది నా దేశము
ఏదీ ఏదీ మన స్వాతంత్రం
ఏదీ హహహా
విప్లవాగ్ని కాగడాలు చేత పట్టి
సాగకుంటే లేదు లేదు స్వారాజ్యం
లలలా లాలలా
లలలా లాలలా



Credits
Writer(s): Chakravarthy K
Lyrics powered by www.musixmatch.com

Link