Sanchari - Hyderabad Gig

గోరంత గాలుల్లో చొరబడి మరి నీకై వెతికే జవాబులే

ఓరి సంచారీ తెగ ఎగబడి నీలా పోరెట్టె దారులే
పై దిక్కే జారి ఊరించె వేవేల రాలేటి తారలే
ఊరెటో తీరెటో ఆగం అయ్యేలా
హోరులో పావులా తేలేవా
దాటితే దొరకదా జాడే ఈయ్యాలా
తరికిటతకధిమిఝణు తాళం తీరా
గోరంత గాలుల్లో చొరబడి మరి నీకై వెతికే జవాబులే

మరువపు సువాసనై మారిన రేకులు
మరువని జనాలతో మాయని మాపులు
ఒకొక్కటి అయోమయం వీడే
ఇటొచ్చి నీ భయాలపై దాడే
ఎటొచ్చి నీదనే కలం తోడై
ప్రతొక్కటి వరాలనే వేడే
రాయమనే కథలే ఓ సంచారి
రాసుకునే ప్రతి కల కథలుగ మారి

పాడమనే పలికే పదమీసారి
పాడుకునే ప్రతి మది కదలిక కోరి

అడుగున పడేసిన తాతల మాటలు
అడుగుకి మెలేసిన తీరని మోజులు
ఒకొక్కటి అయోమయం వీడే
ఇటొచ్చి నీ భయాలపై దాడే
ఎటొచ్చి నీదనే కలం తోడై
ప్రతొక్కటి వరాలనే వేడే
రాయమనే కథలే ఓ సంచారి
రాసుకునే ప్రతి కల కథలుగ మారి
రాయమనే కథలే ఓ సంచారి
రాసుకునే ప్రతి కల కథలుగ మారి
పాడమనే పలికే పదమీసారి
పాడుకునే ప్రతి మది కదలిక కోరి
పాడమనే పలికే పదమీసారి
పాడుకునే ప్రతి మది కదలిక కోరి

గోరంత గాలుల్లో చొరబడి మరి నీకై వెతికే జవాబులే



Credits
Writer(s): Vivek Sagar, Hasith Goli
Lyrics powered by www.musixmatch.com

Link