Rajashekara (From "Mugguru Monagallu")

రాజశేఖరా ఆగలేనురా
రాజశేఖరా ఆగలేనురా
పైటలో స్వరాలనే మీటి చూడరా
ఓ సఖీ చెలి, తేనె జాబిలి
తీరని సుఖాలలో తీపి ఆకలి
రాజశేఖరా
ఓ సఖీ చెలి

చాటుగా తెరచాటుగా కసికాటులో పెదవే
ఘాటుగా అలవాటుగా ఒడిపాఠమే చదివే
చిరుచిత్రాలతో నడుమే అడిగే వగలే
మధుపత్రాలతో నలుగే పెడితే సెగలే
శృంగార గంగ పొంగేటి వేళ రుచులే మరిగే మత్తులో
రాజశేఖరా ఆగలేనురా
పైటలో స్వరాలనే మీటి చూడరా
ఓ సఖీ చెలి, తేనె జాబిలి

కొంటెగా తొలిరాతిరి చలిమంటలే పుడితే
జంటలో కసిచాకిరి గిలిగింటలే కొడితే
గురి చూసేయ్యవా సొగసే బిగిసే సుడిలో
తెర తీసేయ్యవా ఎదలే కరిగే బడిలో
నా లేతఒళ్ళు నీ చూపుముళ్ళు తగిలే రగిలే రేయిలో
రాజశేఖరా ఆగలేనురా
పైటలో స్వరాలనే మీటి చూడరా
ఓ సఖీ చెలి, తేనె జాబిలి
తీరని సుఖాలలో తీపి ఆకలి



Credits
Writer(s): Vennelakanti, Vidyasagar
Lyrics powered by www.musixmatch.com

Link