Chettamma Bathukamma

నింగమ్మా మురిసేటట్టు
సినుకమ్మా కురిసేటట్టు
నా కాలి మొక్కలు మానై
పచ్చని వనమై పరుసుకునేట్టు
నింగమ్మా మురిసేటట్టు
సినుకమ్మా కురిసేటట్టు
నా కాలి మొక్కలు మానై
పచ్చని వనమై పరుసుకునేట్టు
నింగమ్మా మురిసేటట్టు

సెట్లను పెంచంగా వానలు కురవంగా
సెరువమ్మ కడుపు నిండంగో
మా ఊరు ఈరమ్మ కడుపు పండంగా
(సెట్లను పెంచంగా వానలు కురవంగా)
(సెరువమ్మ కడుపు నిండంగో)
(మా ఊరు ఈరమ్మ కడుపు పండంగా)
సెరువు నిండుగుంటే పైరు పచ్చంగుండు
పైరు పచ్చంగుంటే రైతు సల్లంగుండు
రైతు సల్లంగుంటే అన్నీ కులాలలో
నిత్య పండుగోలే నిండు పున్నమోలే
(నింగమ్మా మురిసేటట్టు)
(సినుకమ్మా కురిసేటట్టు)
నా కాలి మొక్కలు మానై
పచ్చని వనమై పరుసుకునేట్టు
నింగమ్మా మురిసేటట్టు

తిరొక్క పువ్వులు తియ్యనైనా పండ్లు
తేనె తట్టల తీపి దాసేనమ్మ సెట్టు
(ఓలాలో ఓలా ఓలాల ఓలాలో ఓలాల)
వేరులెల్లా మందు ఆకులల్లో మింగు
అమ్మవోలె సాగుతుంటది ఒట్టు
(ఓలాలో ఓలా ఓలాల ఓలాలో ఓలాల)
ఇంటికో సెట్టు ఎదురంగా పెట్టు
కడదాక నీ తోడు నీడైయ్యేటట్టు
(నింగమ్మా మురిసేటట్టు)
(సినుకమ్మా కురిసేటట్టు)
నా కాలి మొక్కలు మానై
పచ్చని వనమై పరుసుకునేట్టు
నింగమ్మా మురిసేటట్టు
సినుకమ్మా కురిసేటట్టు

పక్షులు పశువులు జీవరాసులకు
కూడు గూడు నిచ్చే తల్లిరా సెట్టు
(ఓలాలో ఓలా ఓలాల ఓలాలో ఓలాల)
మొక్కలు పుడమిలో మొలసినాటినుండే
మానవాలి ప్రాణ వాయువైనట్టు
(ఓలాలో ఓలా ఓలాల ఓలాలో ఓలాల)
ముందు తరాలకు అందేటట్టు
ముందు తరాలకు అందేటట్టు
ఈ నాడే నీ సేత చెట్టు పెట్టు

నింగమ్మా మురిసేటట్టు
సినుకమ్మా కురిసేటట్టు
నా కాలి మొక్కలు మానై
పచ్చని వనమై పరుసుకునేట్టు
నింగమ్మా మురిసేటట్టు
సినుకమ్మా కురిసేటట్టు



Credits
Writer(s): Thirupathi Matla
Lyrics powered by www.musixmatch.com

Link