Pilla Puli

కవ్వం చిలికినట్టే గుండెల్ని గెలికేస్తివే
యుద్ధం జరిగినట్టే ప్రాణాలు కుదిపేస్తివే
పాలసంద్రాల లోతట్టు దీవుల్లో పుట్నట్టు
ముత్యంలా ఉన్నాదే ముక్కట్టు
కొన్ని అందాలు చూపెట్టు ఇంకొన్ని దాపెట్టు
మొత్తంగా నా నోరే ఊరేట్టు
పిల్లా పులి పిల్లా పులి
పోరగాడే నీకు బలి

ఎర వేశావే సంకురాతిరి సోకుల సంపదని
నరికేశావే నా రాతిరి నిద్దరని
బంగాళాఖాతంలో పడ్డావే బంతిరెక్క
ఎంతెంత తూఫాను రేపావే తస్సాచెక్క

నా మనసుకు అద్దాల జోడెట్టి నీ మిసమిస చూపిస్తివే
నా వయసుకు పగ్గాలు తెగ్గొట్టి నీ పదనిస పాడిస్తివే
అల్లాడించావే
పిల్లా నచ్చావే
Hoy నా మనసుకు అద్దాల జోడెట్టి నీ మిసమిస చూపిస్తివే
నా వయసుకు పగ్గాలు తెగ్గొట్టి నీ పదనిస పాడిస్తివే

చెంపల్లో తారాడే రవ్వల ఝుంకీలా నన్నట్టా పెట్టేసుకో
పాదాలు ముద్దాడే మువ్వల పట్టీలా నీ జంట తిప్పేసుకో
నీ నుదిటి సెమటల్లో కుంకాల బొట్టల్లె తడవాలి నా కల
నీ ఓరచూపుల్లో విసిరేసి పోయిందే నా పాలి వెన్నెల
పిల్లా భూమికొక్క పిల్లా
ఎల్లా నిన్ను వదిలేదెల్లా

Hoy నా మనసుకు అద్దాల జోడెట్టి నీ మిసమిస చూపిస్తివే
నా వయసుకు పగ్గాలు తెగ్గొట్టి నీ పదనిస పాడిస్తివే

మామూలు మాటైనా కొట్నట్టు తిట్నట్టు మహా ముక్కుసూటిలే
నిన్నట్టా చూస్తాంటే నన్నే చూస్తన్నట్టు కేరింతలైతినే
Ho నీలాంటి పిల్లమ్మి మళ్ళొచ్చి నా కంట పడతాదో లేదోలే
ఓ వెయ్యి జనమాలు ఆలస్యం అయితేనేం నీకోసం చూస్తానే
సొట్టబుగ్గ పిట్టా నీకు తాళికట్టా
ఇట్టా ముందుగానే పుట్టా

Hoy నా మనసుకు అద్దాల జోడెట్టి నీ మిసమిస చూపిస్తివే
నా వయసుకు పగ్గాలు తెగ్గొట్టి నీ పదనిస పాడిస్తివే

ఎర వేశావే సంకురాతిరి సోకుల సంపదని
నరికేశావే నా రాతిరి నిద్దరని
బంగాళాఖాతంలో పడ్డావే బంతిరెక్క
ఎంతెంత తూఫాను రేపావే తస్సాచెక్క

Credits
Writer(s): G.v. Prakash Kumar, Ramjogaya Sastry
Lyrics powered by www.musixmatch.com

Link