Sambasiva

సాంబశివ నీదు మహిమ
ఎన్నటికి తెలియదాయే
(సాంబశివ నీదు మహిమ)
(ఎన్నటికి తెలియదాయే)
ఆ సాంబశివ నీదు మహిమ
ఎన్నటికి తెలియదాయే
(సాంబశివ నీదు మహిమ)
(ఎన్నటికి తెలియదాయే)

హర హరా శివ శివ
(హర హరా శివ శివ)

ఆ గంగా జలము తెచ్చి
నీకు అభిషేకము సేతునంటే
(గంగా జలము తెచ్చి)
(నీకు అభిషేకము సేతునంటే)
మరి గంగ జలమున
సేప కప్పల ఎంగిలంటున్నావు శంభో

(హర హరా) అహా (శివ శివ)
(హర హరా శివ శివ హా)

సాంబశివ నీదు మహిమ
ఎన్నటికి తెలియదాయే
(హర హరా శివ శివ)

ఆ ఆవు పాలు తెచ్చి నీకు
అర్పితము సేతునంటే
(ఆవు పాలు తెచ్చి నీకు)
(అర్పితము సేతునంటే)
ఆవుపాల లేగ దూడల
ఎంగిలంటున్నావు శంభో

(హర హరా) ఓహో (శివ శివ)
గట్టిగా (హర హరా శివ శివ) అది

సాంబశివ నీదు మహిమ
ఎన్నటికి తెలియదాయే
(సాంబశివ నీదు మహిమ)
(ఎన్నటికి తెలియదాయే)

ఆహా ఓహో ఓహో

తుమ్మి పూలు తెచ్చి నీకు
తుష్టుగ పూజింతునంటే
(తుమ్మి పూలు తెచ్చి నీకు)
(తుష్టుగ పూజింతునంటే)
కొమ్మ కొమ్మన కోటి తుమ్మెదల
ఎంగిలంటున్నావు శివ

(హర హరా శివ శివ) అర్రే
(హర హరా శివ శివ)

సాంబశివ నీదు మహిమ
ఎన్నటికి తెలియదాయే
(హరా హరా) గట్టిగా (శివ శివ)

నారికలేము తెచ్చి నీకు
నైవేద్యము సేతునంటే
(నారికలేము తెచ్చి నీకు)
(నైవేద్యము సేతునంటే)
అప్పుడు బహుయిష్టము అంటివి శంభో

సామి (హర హరా శివ శివ) ఆహా
(హర హరా) ఓహో (శివ శివ)
(హర హరా శివ శివా)
(హర హరా శివ శివా)



Credits
Writer(s): Sweekar Agasthi, Palnadu Janapadam
Lyrics powered by www.musixmatch.com

Link