Nuvantene Istam

నువ్వంటేనే ఇష్టం నువు కాదంటేనే కష్టం
నువ్వంటేనే ఇష్టం నువు కాదంటేనే కష్టం
ఏం చేయమంటావో... ప్రియతమా
ఆకాశం నేలైనా ఈ నేలే నింగైనా ఆ రెండూ లేకున్నా

నువ్వంటేనే ఇష్టం నువ్వంటేనే ఇష్టం
నువ్వంటేనే ఇష్టం నువు కాదంటేనే కష్టం
నువ్వంటేనే ఇష్టం నువు కాదంటేనే కష్టం

రంపంతోనే వద్దు నీ రూపంతో కోసెయ్యి
సుడిగుండంలో వద్దు నీ ఒడిలో నన్నే నిలువున ముంచెయ్యి
నిప్పులతోనే వద్దు కనుచూపులతో కాల్చేయ్యి
ఉరితాడసలే వద్దు నీ వాలుజడతోనే నా ఊపిరి తియ్యి
మందుపాతరే వద్దమ్మో ముద్దుపాతరే చాలమ్మో
తిరుగుబాటులే వద్దమ్మో అడుగు కింద నలిపేయమ్మో
ఇష్టం ఇష్టం అయినా ఇష్టం
నువు నన్నే చంపు నాలో ప్రేమని కాదంటే కష్టం

నువ్వంటేనే హే నువ్వంటేనే
నువ్వంటేనే ఇష్టం నువు కాదంటేనే కష్టం
ఏం చేయమంటావో... ప్రియతమా

పాతాళానికి వద్దు ఏ నరకానికి పంపొద్దు
నీ గుండెల గుహలో నన్ను తెగ హింసించెయ్యి అంతే చూసెయ్యి
కారాగారం వద్దు ఏ చెరసాలకి పంపొద్దు
నీ కౌగిలిలోనే నన్ను నువు బంధించెయ్యి నన్నంతం చెయ్యి
వేల సార్లు నే జన్మిస్తా వేల సార్లు నే మరణిస్తా
ఒక్కసారి నువు ప్రేమిస్తే చావులేక నే బ్రతికేస్తా
ఇష్టం ఇష్టం ఇది నాకిష్టం
ఏ కష్టాన్నైనా ఎదిరిస్తాను కాదంటే కష్టం

నువ్వంటేనే హే నువ్వంటేనే
నువ్వంటేనే ఇష్టం నువు కాదంటేనే కష్టం
ఏం చేయమంటావో... ప్రియతమా
ఆకాశం నేలైనా
ఈ నేలే నింగైనా
ఆ రెండూ లేకున్నా



Credits
Writer(s): K S Chandra Bose, Gilla Chakradhar
Lyrics powered by www.musixmatch.com

Link