Paina Pataaram

పుట్టువేళ తల్లికి నువ్వు పురిటి నొప్పివైతివి
గిట్టువేళ ఆలికేమో మనసు నొప్పివైతివా
గిట్టువేళ ఆలికేమో మనసు నొప్పివైతివా
బట్ట మరక పడితే నువ్వు కొత్త బట్టలంటివీ
ఇప్పుడేమో ఉతకలేని మట్టి బట్ట కడితివా
ఇప్పుడేమో ఉతకలేని మట్టి బట్ట కడితివా

ఇట్టాగున్నవయ్యో పీటారన్నయ్యో
నీది ఏదేమైనా శానా గొప్ప సావయ్యో
పుచ్చు తోసి మంచి వంగ ఏరినట్టు
స్వచ్ఛమంటి స్వామి నిన్నే కోరినాడయ్య

పైన పటారం ఈడ లోన లొటారం
ఇను boss-u సెబుతా నీ లోకమెవ్వారం
(ఇను boss-u సెబుతా నీ లోకమెవ్వారం)
పైకి బంగారం లోన గూడు పుటారం
గెలికి సూడు తెలిసిపోద్ది అసలు బండారం
(గెలికి సూడు తెలిసిపోద్ది అసలు బండారం)

మనుషులు మాయగాళ్ళు మచ్చలున్న కేటుగాళ్ళు
కానీ ఎవరికాళ్ళు మనసులున్న great-uగాళ్ళు
నాది నాది అన్న స్వార్ధమున్న సెడ్డవాళ్ళు
నీలా బ్రతకలేని డబ్బులున్న పేదవాళ్ళు
నాకాడ వందుంటే నా ఏంటే తిరిగేటోళ్ళు
నీకాడ వెయ్యుంటే నాపైనే మొరుగుతారు
సందంట పోతాంటే సూసి కూడా పలకనోళ్ళు
నీకాడ సొమ్ముంటే ఇంట చేరి పొగుడుతుంటారు

లోకమెంతో లోతయ్యా పీటరన్నయ్యా
అది తవ్వి చూడడానికే ఈ జీవితమయ్యా
తొవ్వేకొద్దీ వస్తుంటారు నిండా ముంచి పోతుంటారు
నీతో నాతో ఉండే సగం దొంగోల్లేనయ్యా
We are very happy boss-u
నువ్వుండేదే safest place-u
We are very happy boss-u
నువ్వుండేదే safest place-u

పైన పటారం ఈడ లోన లొటారం
ఇను boss-u సెబుతా నీ లోకమెవ్వారం
పైకి బంగారం లోన గూడు పుటారం
గెలికి సూడు తెలిసిపోద్ది అసలు బండారం

Car-u బంగళాలు వేలికున్న ఉంగరాలు
ఏవీ రావంట సచ్చినాక మనవెంట
నీతో ఉన్నవాళ్ళు నిన్ను మోసి కన్నవాళ్ళు
వెళిపోతారంతా వెలిగినాక సితి మంట
మట్టి మీద నువ్ కలిసిన బంధాలన్నీ అబద్ధం
మట్టిలోన పిచ్చి పురుగుల జట్టే చివరి ప్రపంచం

మనిషి తీరు మారదయ్యా పీటరన్నయ్యా
అందుకనే సెబుతున్న ఇనరాదయ్యా
బాధే లేని బెంగే లేని రేపేంటన్న సింతేలేని
సోటేదైనా ఉన్నాదంటే స్మశానమేరా, అందుకే

(We are very happy boss-u
నువ్వుండేదే safest place-u)

పైన పటారం ఈడ లోన లొటారం
ఇను boss-u సెబుతా నీ లోకమెవ్వారం
పైకి బంగారం లోన గూడు పుటారం
గెలికి సూడు తెలిసిపోద్ది అసలు బండారం
గెలికి సూడు తెలిసిపోద్ది అసలు బండారం
గెలికి సూడు తెలిసిపోద్ది అసలు బండారం



Credits
Writer(s): Jakes Bejoy, Sanare
Lyrics powered by www.musixmatch.com

Link